Breaking News

వారియర్‌గా 'రష్మిక మందన్నా'.. కొత్త సినిమా ప్రకటన

Published on Fri, 06/27/2025 - 14:00

2018లో "ఛలో" తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా సత్త చాటుతున్నారు. పుష్ప, యానిమల్‌, ఛావా సినిమాలతో పాటు రీసెంట్‌గా 'కుబేర'తో  బాక్సాఫీస్‌ వద్ద  మెప్పించారు.  కిల్లర్ లుక్స్‌తో ఇటు యూత్‌ ఐకాన్‌గా, అటు దర్శక నిర్మతాల బెస్ట్‌ ఆప్షన్‌గా ఆమె మారిందని చెప్పవచ్చు. వరుస చిత్రాలలో తన అద్భుతమైన నటనతో రష్మిక అగ్ర నటిగా నిలదొక్కుకున్నారు. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమె మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. త్వరలో 'మైసా' అనే సినిమాతో వస్తున్నట్లు ఒక పోస్టర్‌తో ప్రకటించారు. 

అందులో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించి సినిమాపై ఆసక్తి పెంచారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. తాను గతంలో ఎప్పుడూ పోషించని పాత్రతో 'మైసా' కోసం చేస్తున్నట్లు రష్మిక చెప్పారు. అభిమానుల కోసం ఎప్పుడు కూడా కొత్తగా, భిన్నంగా ఉన్న పాత్రలే చేయాలనేది తన ఉద్దేశం అంటూ పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ మైసా పోస్టర్‌ను రష్మిక షేర్‌ చేశారు. ఇప్పటి వరకు రష్మికను శ్రీవల్లి, గీతాంజలిగా చూసిన ప్రేక్షకులు త్వరలో  ఒక వారియర్‌గా ఆమెను చూడనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. మరిన్ని విషయాలు త్వరలో  ప్రకటించనున్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)