Breaking News

మీరు చేసిన సాయం జీవితాంతం గుర్తుంచుకుంటా: రష్మిక

Published on Tue, 06/24/2025 - 12:22

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌పై నేషనల్‌  క్రష్‌ రష్మిక(Rashmika Mandanna ) ప్రశంసల వర్షం కురిపించింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన చేసే పనులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడింది. అందరితో చాలా మర్యాదగా మాట్లాడతాడని చెప్పు, అలాంటి గొప్ప నటుడితో పని చేయడం ఆనందంగా ఉందని సోషల్‌ మీడియా వేదికగా ధనుష్‌ని పొగడ్తలతో ముంచేస్తూ.. ఆయనతో దిగిన సెల్ఫీ ఫోటోని షేర్‌ చేసింది.

‘మీతో అంతపెద్ద సినిమా(కుబేర) చేసినప్పటికీ.. మనమిద్దరం కలిసి ఒక్క సెల్ఫీ మాత్రమే తీసుకున్నాం. మీరు చాలా అద్భుతమైన వ్యక్తి. ప్రతి రోజు కష్టపడి పని చేస్తున్నందుకు ధన్యవాదాలు. మనం మాట్లాడుకున్న ప్రతి సారి వేరు వేరు నగరాల్లో ఉండేవాల్లం. విశ్రాంతి ఎంత అవసరమో చర్చించుకునే వాళ్లం కానీ..మనం మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. కుబేరలో మాత్రమే కాదు..ప్రతి సినిమాలోనే మీ నటన అద్భుతంగా ఉంటుంది. నాతోనే కాదు చుట్టూ ఉన్నవాళ్లతో చాలా మర్యాదగా మాట్లాడతారు. సెట్‌లో నాకోసం తెచ్చిన లడ్డూలను ఎప్పటికీ గుర్తించుకుంటాను. అలాగే నాకు తమిళ​ డైలాగుల విషయంలో మీరు చేసి సాయం.. నేను ఏదైనా డైలాగు చెబితే మీరు ప్రశంసించిన తీరు.. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అయినా.. జీవితాంతం గుర్తుంటాయి ధనుష్‌ సార్’ అని రష్మిక ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.

కుబేర( Kuberaa ) విషయానికొస్తే.. ధనుష్‌, నాగార్జున హీరోలుగా నటించిన ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్ర పోషించింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైన హిట్‌ టాక్‌ని సంపాదించుకుంది. ధనుష్‌ నటనపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)