Breaking News

'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Published on Fri, 04/05/2024 - 14:17

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.

నేడు రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రష్మిక సింపుల్ మేకోవర్‌లో బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. "ది గర్ల్ ఫ్రెండ్" లో ఆమె కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌లో ఉంది. ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్‌ ప్రకటించారు.

ఇప్పటికే పుష్ప 2 చిత్రం నుంచి కూడా రష్మిక ఫస్ట్‌ లుక్‌ పోస్ట్‌ విడుదలైంది. అందులో ఆమె లుక్‌ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు ఉండటంతో  టీజర్‌ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదిలో రష్మిక నుంచి దాదాపు నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)