Breaking News

డబ్బు కోసమే తప్పుడు వార్తలు రాస్తున్నారు: రష్మిక

Published on Thu, 01/29/2026 - 07:02

మనుషుల మనో భావాలు రక రకాలుగా ఉంటాయి. ఇక సినీ తారల అభిప్రాయలు సందర్భానుసారంగా ఉంటాయని చెప్పవచ్చు. కొందరు తమపై వచ్చే విమర్శలను స్వాగతిస్తున్నామంటారు. మరి కొందరు  వదంతులను ఎంజాయ్‌ చేస్తున్నామంటారు. ఇంకొందరు సీరియస్‌గా రియాక్ట్‌ అవుతుంటారు. ఇందుకు మన కథానాయకిలు అతీతంగా కాదు. అలా నటి రష్మిక మందన్నా(Rashmika Mandanna) కూడా వదంతులపై స్పందించారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషలో నటించిన తొలి చిత్రం తరువాత నుంచే వివాదాల్లో చిక్కుకున్నారనే చెప్పాలి. ఆ తరువాత కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురయ్యారు. ఆ తరువాత ప్రేమ వ్యవహారంలో వైరల్‌ అయ్యారు. 

విషయం ఏమిటంటే ఇవేవీ ఈ భామ కెరీర్‌కు ఎఫెక్ట్‌ అవ్వలేదు. అదే సమయంలో అవన్నీ ఈమెకు ప్లస్‌ అయ్యాయనే చెప్పాలి. అందుకే శాండిల్‌ వుడ్‌ వైయా టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ దాటి బాలీవుడ్‌లోనూ వరుస విజయాలను సాధిస్తూ నేషనల్‌ క్రష్‌గా వెలిగిపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలతో పాటూ హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి వైరల్‌ అవుతున్న రకరకాల ట్రోలింగ్స్‌పై స్పందించిన రష్మిక మందన్నా  అసత్య ప్రచారాలపై ఎందుకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. అలాంటి విషయాలపై స్పందిస్తే వారిని ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. కొందరు డబ్బు కోసమే అలాంటి నిరాధారమైన వార్తలు రాస్తున్నారని అన్నారు. అలాంటి ముఖం తెలియని వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎప్పుడూ ఒకేలా ఉంటున్నానని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు.

Videos

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు

Jada Sravan : అల్లాడిపోతున్న నాలుగు ప్రాణాలు ఎంత లాగితే అంత నష్టమే..

Tirumala Laddu: బద్దలైన చంద్రబాబు కుట్ర.. ఎల్లో మీడియా వత్తాసు

Roja: తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని CBI రిపోర్ట్ ఇచ్చింది

YV Subba: తిరుపతి లడ్డూ విషయంలో TDP తప్పుడు ప్రచారం

గీతం ల్యాండ్ స్కాం ఇష్యూపై పవన్ కళ్యాణ్ కు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

Phone Tapping: ఇది రేవంత్ ఆడుతున్న రాక్షస రాజకీయ క్రీడ

జగన్ సర్వేపై కేంద్రం ప్రశంసలు

కేసీఆర్ ఇంటికి సిట్ నోటీసుల అందజేత

GITAM University : 150 ఎకరాలు స్వాహా చేశాడు చెప్పేవి నీతులు.. చేసేవి కబ్జాలు..

Photos

+5

కుమారులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో హీరో ధనుశ్ (ఫొటోలు)

+5

అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోలు చూశారా?

+5

బేగంపేట్‌ : అట్టహాసంగా వింగ్స్‌ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)

+5

వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం (ఫొటోలు)

+5

ఆదివాసీ ఆచారాలతో సారలమ్మకు స్వాగతం.. మేడారంలో కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

'హే భగవాన్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ఫుల్ గ్లామరస్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు

+5

బ్లూ శారీలో యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు.. ఫోటోలు

+5

హీరోయిన్ శ్రుతిహాసన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

ప్రియాంక చోప్రా జనవరి జ్ఞాపకాలు.. కూతురు, భర్తతో చిల్ మోడ్ (ఫొటోలు)