Breaking News

మేము ప్రశ్నిస్తే.. ఈ వృత్తిలోకి తెలిసే వచ్చారు కదా అంటున్నారు: రష్మిక

Published on Mon, 02/05/2024 - 07:20

సినిమా అనే పవర్‌ఫుల్‌ మీడియాలో సక్సెస్‌ఫుల్‌ హీరో హీరోయిన్లకు ఉండే క్రేజే వేరు. అయితే వాళ్లు మామూలు మనుషులే. సమస్యలు అనే వాటికి వారు అతీతులు కారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్న సామెతలా వ్యక్తిగత సమస్యలతో పాటు కొందరు చర్యలు వారిని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు నటీమణుల గురించి వదంతులు ప్రచారం చేయడం జరుగుతూ వస్తోంది. అయితే తాజాగా డీప్‌ ఫేక్‌ అనేది వారిని వేదనకు గురిచేస్తోంది.

అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో కొందరు నటీమణులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏఐ అనే టెక్నాలజీతో హీరోయిన్లను నకిలీ ముఖాలను (డీప్‌ ఫేక్‌) రూపొందించి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తున్నారు. ఇలాంటి వాటిని రష్మిక మందన్న, కాజోల్‌, కత్రినా కైఫ్‌, అభిరామి వంటి ప్రముఖ తారలు ఎదుర్కొంటున్నారు. ఫేక్‌ వీడియోలపై రష్మిక మందన్న ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ డీప్‌ ఫేక్‌ వీడియోలు నానాటికి పెరుగుతున్నాయనే ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై ప్రశ్నిస్తే ఇలాంటివన్నీ కోరుకునే కదా మీరు వృత్తిలోకి వచ్చారు అని అంటున్నారన్నారు. ఇతర అమ్మాయిలకు ఇలాంటివి ఎదురైతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. ఇప్పుడు అమ్మాయిల పరిస్థితి చూస్తుంటే భయమేస్తోందన్నారు. దీని గురించి తనలాంటి వాళ్లు మాట్లాడితే డీప్‌ ఫేక్‌ అంటే ఏమిటి, ఇలాంటివి కరెక్టేనా అనే అంశాలపై కొందరు మహిళలకైనా తెలిసే అవకాశం ఉంటుందన్నారు. అసలు ఈ డీప్‌ ఫేక్‌ అనే విషయం గురించి అవగాహన కలగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని రష్మిక మందన్న వ్యక్తం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)