Breaking News

సౌందర్య బయోపిక్‌లో నటిస్తానంటున్న స్టార్‌ హీరోయిన్‌

Published on Thu, 02/01/2024 - 08:38

నటనకు ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే ఎంచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సౌందర్య. ఈ కన్నడ నటి 1992లో విడుదలైన పా నానా ప్రిదీసు అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత 1993లో పొన్మణి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక్కడ రజనీకాంత్‌, విజయ్‌కాంత్‌, పార్తీపన్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించారు. రజనీకాంత్‌ సరసన నటించిన పడయప్పా, అరుణాచలం చిత్రాలు సూపర్‌హిట్‌ అయ్యి సౌందర్యను స్టార్‌ హీరోయిన్‌ను చేశాయి.

అదే విధంగా తెలుగు,మలయాళం భాషల్లోనూ నటించి బహుభాషా నటిగా రాణించారు. తెలుగులో చిరంజీవి,వెంకటేష్‌,నాగార్జున వంటి అగ్ర హీరోలతో నటించి ఆమె చెరగని ముద్ర వేసింది అలా ప్రముఖ కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే ఆమె 2004లో భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి హెలీకాప్టర్‌లో వెళ్తూ దుర్మరణం చెందారు.

కాగా ప్రస్తుతం పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తున్న నటి రష్మిక మందన్నా కూడా కన్నడ భామే అన్నది తెలిసిందే. ఈమె కూడా మాతృభాషలో కథానాయకిగా పరిచయం అయ్యి ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీలో కథానాయకిగా నటిస్తున్నారు. ఇటీవల ఈ బ్యూటీ ఓ భేటీలో పేర్కొంటూ తనకు నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఆశగా ఉందన్నారు. తనను చిన్నతనంలో సౌందర్యలా ఉన్నావని తన తండ్రి అనే వారని, ఆ విషయాన్ని తలచుకుంటే గర్వంగా ఉంటుందన్నారు. అవకాశం వస్తే కచ్చితంగా సౌందర్య బయోపిక్‌లో నటిస్తానని పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)