Breaking News

ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకోవడం ముఖ్యం: రష్మికా మందన్న

Published on Wed, 05/29/2024 - 00:02

‘‘ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకోవడం  ముఖ్యం. సినిమాల్లోకి వచ్చాక నేను ఈ విషయం తెలుసుకున్నాను. ఆనంద్‌ నాకు బ్రదర్‌లాంటి వాడు. అతని మీద నేను చాలా ఆధారపడుతుంటాననే విషయం ఆనంద్‌కే తెలియదు. ‘గం..గం..గణేశా’ సక్సెస్‌ సాధిస్తే ఆనంద్‌ ముఖంలో నవ్వు ఉంటుంది. ఆ విజయం తాలూకు నవ్వుని నేను చూడాలనుకుంటున్నాను’’ అన్నారు.

హీరోయిన్‌ రష్మికా మందన్న. ఆనంద్‌ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకి రష్మికా మందన్న ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘గం..గం..గణేశా’ సాంగ్స్‌కు నేను డ్యాన్సులు చేశాను. చేతన్‌ భరద్వాజ్‌ మ్యూజిక్‌ చాలా బాగుంది. 

డైరెక్టర్‌ ఉదయ్‌కి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ ఇవ్వాలి. వంశీ, కేదార్, అనురాగ్‌లకు ఈ మూవీ మంచి లాభాలు తీసుకురావాలి’’ అన్నారు. ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘క్రైమ్‌ కామెడీలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ కలిపి వినోదాత్మకంగా తీసిన చిత్రం ‘గం..గం..గణేశా’. నేను ఈ సినిమాలో కనిపించినంత ఎనర్జిటిక్‌గా ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించలేదు’’ అన్నారు. ‘‘గం..గం..గణేశా’లో ఒక అతిథి పాత్ర ఉంది. ఆ పాత్రను థియేటర్‌లో చూసి షాక్‌ అయ్యేందుకు రెడీగా ఉండండి’’ అన్నారు ఉదయ్‌ శెట్టి. దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌ రెడ్డి, నిర్మాత బన్నీ వాసు, సహనిర్మాత అనురాగ్‌ పర్వతనేని తదితరులు పాల్గొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)