రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన
Breaking News
రష్మిక- విజయ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వీడియో వైరల్..!
Published on Sun, 02/01/2026 - 10:30
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పుష్ప మూవీతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న రష్మిక.. బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తోంది ముద్దుగుమ్మ.
అయితే రష్మిక సినీ కెరీర్ పక్కనపెడితే.. వ్యక్తిగతంగా ఎన్నో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాది విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ అయిందని వార్తలొచ్చినా.. వీళ్లు మాత్రం అఫీషియల్‌గా ప్రకటించలేదు. అయితే ఈవెంట్స్‌లో మాత్రం చెప్పి చెప్పనట్లుగా మాట్లాడుతూ వచ్చారు. అలా అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల వీరిద్దరి పెళ్లి ఉదయ్‌పూర్‌లో జరగనుందని వార్తలొచ్చాయి. దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అటు విజయ్ దేవరకొండ కానీ.. రష్మిక కానీ ఎక్కడా బయటికి చెప్పలేదు.
కానీ తాజాగా వీరి పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరలవుతోంది. ఇద్దరు ఈవెంట్ ప్లానర్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఇది రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఇద్దరు అమ్మాయిలు వీడియోలో మాట్లాడారు. రష్మిక- విజయ్ ఈ నెల 2న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఇదంతా ఫేక్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే రష్మిక కానీ.. విజయ్ కానీ క్లారిటీ ఇవ్వాల్సిందే.
Rashmika Mandanna and Vijay Devrakonda are getting married in Udaipur on Feb 2 😲
-Confirmed by the Event Planners.
pic.twitter.com/HXGUS8RdOE— Christopher Kanagaraj (@Chrissuccess) January 31, 2026
Tags : 1