Breaking News

వాస్తవ కథను వెలికి తీద్దాం

Published on Mon, 07/07/2025 - 01:40

‘‘ఒక భారీ అగ్ని ఎగిసే క్షణం ఆసన్నమైంది... కొందరు అపరిచితుల గురించి తెలియని వాస్తవ కథను వెలికి తీద్దాం’’ అంటూ హిందీ చిత్రం ‘ధురంధర్‌’లోని తన పోస్టర్‌ని, టీజర్‌ని షేర్‌ చేశారు హీరో రణ్‌వీర్‌ సింగ్‌. ఆదివారం (జూలై 6) రణ్‌వీర్‌ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్, టీజర్‌ని విడుదల చేసి, ఈ సినిమాని డిసెంబరు 5న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టీజర్‌లో రణ్‌వీర్‌ ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు.

థ్రిల్, వయొలెన్స్, మిస్టరీలతో ఈ టీజర్‌ సాగుతుంది, ‘ధురంధర్‌’లో సంజయ్‌ దత్, మాధవన్, అర్జున్‌ రామ్‌పాల్, అక్షయ్‌ ఖన్నా, సారా అర్జున్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడిగా తొలి చిత్రం ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ (2019)తో జాతీయ అవార్డు సాధించిన ఆదిత్య ధర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని భారత నిఘా, శాంతి భద్రతల మాజీ అధికారి, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. జియో స్టూడియోస్‌ సమర్పణలో బీ62 స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిత్రదర్శకుడు ఆదిత్య ధర్‌ ఓ నిర్మాత కాగా, జ్యోతీ దేశ్‌పాండే సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)