బిడ్డకు పాలు పట్టి.. షూటింగ్‌కి వెళ్లా.. ఎవరూ అలా చెప్పరు: నటి

Published on Tue, 10/14/2025 - 16:56

ఏ రంగంలో అయినా మహిళలు రాణించాలంటే.. చాలా త్యాగాలు చేయాల్సిందే. ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు ఎంచుకున్న రంగంపై ఫోకస్‌ చేయాలి. ఎన్నో కష్టాలను అనుభవిస్తే కానీ ఆ రంగంలో ఉన్నతస్థానానికి చేరుకోలేరు. చిత్రపరిశ్రమలో ఆ కష్టాలు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. ఫ్యామిలీ బాధ్యతతో పాటు వేధింపులను, ఒత్తిడిని తట్టుకొని నిలబడితేనే ‘స్టార్‌’ హోదా పొందుతారు. అలాంటి కష్టాలను ఎన్నో భరించే ఈ స్థాయికి వచ్చానని చెబుతున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రాణి ముఖర్జీ(Rani Mukerji). ఇటీవలే ఉత్తమన నటిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కెరీర్‌ ప్రారంభంలో తకు ఎదురైన ఇబ్బందుల గురించి వివరించింది.

‘ఇండస్ట్రీలోకి రావడానికి చాలా పోరాటాలే చేయాల్సి వచ్చింది. నేను ఇండస్ట్రీలోకి రావడం మా పెరెంట్స్‌కి ఇష్టమే లేదు. బలవంతంగా ఒప్పుకున్నారు. వారి పేరు చెడగొట్టకూడనే ఉద్దేశ్యంతో నేను కమిట్‌మెంట్‌తో పని చేశాను. నేను నటించిన ‘హిచ్‌కీ’ సినిమా షూటింగ్‌ సమయంలో నా కుమార్తె అదిరాకి కేవలం 14 నెలల వయసు మాత్రమే. అప్పటికీ పాలు పడుతున్నా. ఉదయం ఆరున్నర గంటలకు పాలు పట్టించి.. షూటింగ్‌కి వెళ్లేదాన్ని. ఒంటి గంటలోపు నా పార్ట్‌ పూర్తి చేసుకొని తిరిగి నా బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇంటికి వచ్చేదాన్ని. 

రోజుకు 6-7 గంటలు షూటింగ్‌ చేసి.. ఇంటికి వెళ్లేదాన్ని. మా దర్శకుడితో పాటు యూనిట్‌ అంతా నాకు సపోర్ట్‌ చేసేది. ఈ సినిమా మొత్తం అలానే పూర్తి చేశా. ఇప్పుడు పని గంటల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. నిర్మాతకు, దర్శకుడికి ఓకే అయితే సినిమా చేయాలి. లేదంటే ఆ సినిమా మానేయాలి. అది మన చేతుల్లో ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా చేయాల్సిందే అని ఎవరు చెప్పరు’ అని రాణి ముఖర్జీ అన్నారు. 

ఇక జాతీయ అవార్డు గురించి మాట్లాడుతూ.. ‘నటీనటులుకు చిన్న పురస్కారం కూడా చాలా గొప్పదే. అయితే ఏ అవార్డు అయినా.. అర్హత గలవారికి వచ్చిందని ప్రేక్షకులు భావించాలి. నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు అందరూ అంగీకరించారు. అలా అందరూ అంగీకారం తెలపడం నాకు అవార్డు కంటే చాలా గొప్పగా అనిపించింది’ అన్నారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)