ఇక నేను బిడ్డను కనలేను: రాణీ ముఖర్జీ

Published on Fri, 03/22/2024 - 17:33

కడుపులో బిడ్డ పెరుగుతుందంటే కోటి ఆశలతో ఎదురు చూస్తుందా మహిళ. కానీ ఆ బిడ్డ ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే కాలం చేసిందంటే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లుతుందో! అలాంటి నరకవేదన అనుభవించింది రాణి ముఖర్జీ.. తనకు గర్భస్రావమైన విషయాన్ని గతేడాది వెల్లడించింది. తాజాగా మరోసారి ఆ బాధను గుర్తు చేసుకుంది నటి.

ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించా..
'నా కూతురికి ఇప్పుడు ఎనిమిదేళ్లు. తనకు ఏడాది వయసు రాగానే మళ్లీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశాను. దాదాపు ఏడేళ్లు ప్రయత్నించాము. 2020వ ఏడాది గర్భం దాల్చాను. కానీ ఆ సంతోషం ఎన్నోనాళ్లు నిలవలేదు. కడుపులోనే బిడ్డను కోల్పోయాను. ఆ నరకం అనుభవించినవారికే తెలుస్తుంది. నేను పైకి కనిపించేంత యంగ్‌ కాదు. నేనిప్పుడు 46వ పడిలోకి అడుగుపెట్టాను. ఈ వయసులో బిడ్డను కనలేను. కానీ నా కూతురికి ఒక తమ్ముడినో, చెల్లెనో ఇవ్వలేకపోయానన్న బాధ మాత్రం ఇప్పటికీ ఉంది.

తనతో ఆడుకోవడానికి బిడ్డను ఇవ్వలేకపోయా
అయినా ఉన్నదాంట్లోనే సంతోషం వెతుక్కోవాలి. అధీరా (రాణి కూతురు) నా బంగారు తల్లి. తన వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డను కనే వయసు దాటేశాను. కాబట్టి నాకు అధీరా ఒక్కరు చాలు' అని చెప్పుకొచ్చింది. కాగా రాణి ముఖర్జీ.. హలో బ్రదర్‌, హర్‌ దిల్‌ జో ప్యార్‌ కరేగా, ప్యార్‌ దీవానా హోతా హై, చలో ఇష్క్‌ లడాయే, చోరీ చోరీ, ఎల్‌వోసీ: కార్గిల్‌, మిసెస్‌ చటర్జీ వర్సెస్‌ నార్వే వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది. 

చదవండి: అయ్యో శ్రీలీల.. అప్పుడేమో నెలకో సినిమా.. ఇప్పుడేమో ఇలా..

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)