Breaking News

Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ

Published on Fri, 07/07/2023 - 08:09

టైటిల్: రంగబలి
నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, షైన్ టామ్ చాకో తదితరులు
నిర్మాణ సంస్థ: SLV సినిమాస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
సంగీతం: పవన్ సీహెచ్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
విడుదల తేదీ: 07-07-2023

Rangabali Movie Rating And Cast

హీరో నాగశౌర్య పేరు చెప్పగానే మంచి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. అలానే చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'ఛలో' తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కట్లేదు. ఇప్పుడు 'రంగబలి' అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో బ్లాక్ బస్టర్ కొట‍్టబోతున్నామని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గట్టిగా చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ నాగశౌర్య చెప్పినట్లు ఉందా? సినిమా టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 

Rangabali Movie Review In Telugu

కథేంటి?
శౌర్య(నాగశౌర్య)ది రాజవరం. ఊరిలో బేవార్స్ గా తిరుగుతూ ఎక్కువగా షో చేస్తుంటాడు అందుకే అందరూ ఇతడిని 'షో' అని పిలుస్తుంటారు. ఊరంటే పిచ్చి ఇష్టం. చచ్చినా బతికినా సొంతూరిలోనే అనేది శౌర్య మనస్తత్వం. అలాంటిది ఓ పనిమీద వైజాగ్ వెళ్తాడు. అక్కడ సహజ(యుక్తి తరేజా)ని చూసి లవ్ లో పడతాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమిస్తుంది. దీంతో పెళ్లి గురించి మాట్లాడేందుకు శౌర్య.. సహజ తండ్రి కలవడానికి వెళ్తాడు. తనది రాజవరం అని చెబుతాడు. తన ఊరిలోని 'రంగబలి' సెంటర్ ప్రస్తావన వస్తుంది. దీంతో ఆయన పెళ్లికి నో చెబుతాడు. ఇంతకీ ఆ సెంటర్‌తో శౌర్య పెళ‍్లికి వచ్చిన చిక్కేంటి? చివరకు శౌర్య ఏం చేశాడు? అనేదే మెయిన్ స్టోరీ.

Rangabali Movie Photos

ఎలా ఉందంటే?
తెలుగు కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమా అనగానే.. ఎలా ఉంటుందా అనేది మనకు ఓ ఐడియా ఉంది. దానికి ఏ మాత్రం అటు ఇటు కాకుండా 'రంగబలి' తీశారు. ట్రైలర్ లో చెప్పినట్లు.. బయట ఊరిలో బానిసలా బతకడం కంటే సొంతూరిలో సింహంలా బతకాలనేది హీరో క్యారెక్టరైజేషన్. ఫస్టాప్ మొదలవడమే మెల్లగా స్టోరీలోకి వెళ్లిపోయారు. మంచి ఎలివేషన్‌తో హీరో ఎంట్రీ. ఆ వెంటనే ఫైట్. ఆ తర్వాత హీరో చుట్టూ ఉండే వాతావరణాన్ని సీన్ బై సీన్ చూపించారు. తండ్రి విశ్వం(గోపరాజు రమణ)కి ఊరిలో మెడికల్ షాప్. కొడుకు శౌర్యకి దాన్ని అప్పగించాలని ఆయన ఆశ. మనోడేమో ఊరిలో కుర్రాళ్లతో బేవార్స్ గా తిరుగుతుంటాడు. 

ఓ పనిమీద శౌర్య వైజాగ్ వెళ్లడం, అక్కడ హీరోయిన్ తో హీరో లవ్ లో పడటం, పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోకపోవడం ఇలా సీన్లన్నీ వెళ్తుంటాయి. అయితే ఇలాంటి సన్నివేశాల్ని ఎక్కడో చూశామే అనిపించినప్పటికీ ఫస్టాప్ మొత్తం హీరో అతడి ఫ్రెండ్ అగాధం క్యారెక్టర్ చేసే కామెడీతో అలా వెళ‍్లిపోతుంది. పెళ్లి కోసం హీరోయిన్ తండ్రి దగ్గరకు వెళ్లిన హీరోకు తన ఊరిలో 'రంగబలి' సెంటర్ వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఇంతకీ ఆ సెంటర్ తో హీరోయిన్ తండ్రికి ఉన్న సమస్యేంటి? చివరకు అది పరిష్కారమైందా లేదా అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

దర్శకుడు ఓ పాయింట్ చెప్పాలనుకున్నాడు. దాన్ని కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాగా తీశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఫస్టాప్ మొత్తాన్ని స్టోరీ సెట్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. సెకండాఫ్ లో అసలు విషయాన్ని బయటపెట్టాడు. కానీ అది ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసిన కథలా అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే  ఏం కొత్తగా ఉండదు. క్లైమాక్స్ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. అప్పటివరకు మారని జనం.. హీరో 5 నిమిషాల స్పీచ్ ఇవ్వగానే మారిపోతారు. కొన్నేళ్ల ముందు వరకు ఈ తరహా స్టోరీలంటే ఓకే గానీ.. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయిన ఈ జమానాలో కూడా ఇలాంటి స్టోరీలా బాసూ!

Naga Shourya In Rangabali

ఎవరెలా చేశారు?
హీరో నాగశౌర్యకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తనదైన ఈజ్‌తో యాక్టింగ్, కామెడీ, డ్యాన్సులు అలా చేసుకుంటూ వెళ్లిపోయాడు. యాక్షన్ హీరో కావాలనే ఆరాటం ఈ సినిమాలో బాగానే కనిపించింది. అవసరం లేకున్నా సరే కొన్నిచోట్ల బాడీని చూపించాడు. ఫైట్లు కూడా చేశాడు. స్టోరీకి తగ్గట్లు అవి కాస్త లాజిక్‌గా ఉండుంటే బాగుండేది. హీరోయిన్ యుక్తి తరేజాకు పెద్దగా స్కోప్ దక్కలేదు. హీరోతో లవ్ సీన్లు, రెండు మూడు పాటల్లో కనిపించింది. ఓ పాటలో అయితే కిస్, స్కిన్ షోతో రెచ్చిపోయింది! 

మిగిలిన వాళ్లలో సత్య గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఫస్టాప్ ని తన కామెడీతో లాక్కొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్టాప్ కి సత్యనే హీరో. లేకపోయింటే సినిమా బలైపోయేది! గోపరాజు రమణ హీరో తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. సత్య, గోపరాజు రమణ పాత్రలకు ఫస్టాప్ లో దొరికిన స్పేస్.. సెకండాఫ్ లోనూ ఉండుంటే బాగుండేది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.. ఇందులో విలన్‌గా చేశాడు. అతడి పాత్ర పరిచయం ఓకే కానీ ఎండింగ్ పేలవంగా ఉంది. నటుడిగా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అసలు అతడి పాత్రకు సరైన సీన్లు ఒక్కటంటే ఒక్కటీ పడలేదు. సెకండాఫ్ లో శరత్ కుమార్, శుభలేఖ సుధాకర్ పర్వాలేదనిపించారు. మిగిలినవాళ్లు ఓకే.

టెక్నికల్ విషయాలకొస్తే.. పవన్ సీహెచ్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. అవి కూడా సందర్భం లేకుండా వస్తుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్లు ఉన్నాయి. రైటర్ అండ్ డైరెక్టర్ పవన్ బాసంశెట్టికి ఇది తొలి సినిమా. కొన్ని సీన్లనీ బాగానే హ్యాండిల్ చేశాడు గానీ సినిమా కథ, సీన్లపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'రంగబలి'.. కాస్త ఫన్ కాస్త ఎమోషన్ ఉండే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్.

-చందు, సాక్షి వెబ్‌డెస్క్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)