Breaking News

ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రణ్‌బీర్‌ కపూర్‌

Published on Tue, 02/28/2023 - 05:03

‘భారత మాజీ క్రికెటర్‌ సౌరభ్‌ గంగూలీ బయోపిక్‌లో నేను నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు’ అన్నారు బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌. డైరెక్టర్‌ లవ్‌ రంజన్‌ తెరకెక్కించిన తాజా హిందీ చిత్రం ‘తూ ఝూటీ మై మక్కార్‌’. రణ్‌బీర్‌ కపూర్, శ్రద్ధాకపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 3న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు రణ్‌బీర్‌ కపూర్‌.

‘‘గంగూలీగారికి ప్రపంచమంతా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆయన బయోపిక్‌ అంటే అది అందరికీ స్పెషలే. కానీ ఆయన బయోపిక్‌లో నటించాలనే అవకాశం నాకు రాలేదు. నాకు తెలిసి ఈ బయోపిక్‌కి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ఇంకా జరుగుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రముఖ గాయకులు, నటులు కిషోర్‌ కుమార్‌గారి బయోపిక్‌ కోసం 11ఏళ్లుగా వర్క్‌ జరుగుతోంది. దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్‌ బసు ఈ స్క్రిప్ట్‌ వర్క్‌లో భాగస్వామిగా ఉన్నారు. నేను చేయబోయే నెక్ట్స్‌ బయోపిక్‌ కిషోర్‌ కుమార్‌గారిదే అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యాని మల్‌’ చేస్తున్నారు రణ్‌బీర్‌ కపూర్‌. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్‌ కానుంది. 

Videos

మిడ్ నైట్ గుస గుసలు.. ఆటను రామ్ ప్రసాద్ మారుస్తున్నాడా?

2019 హిస్టరీ రిపీట్ చేద్దాం.. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం

సాక్షి సంచలన రిపోర్ట్...బయటపడ్డ మరో వ్యక్తి

భారీగా తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే?

చిన్న శ్రీను పార్టీ మారడంపై బొత్స హాట్ కామెంట్స్

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్

YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్

Photos

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)