Breaking News

ఆకట్టుకుంటున్న బ్రహ్మాస్త్ర కొత్త టీజర్‌, నాగార్జున లుక్‌ రిలీజ్‌

Published on Wed, 06/01/2022 - 18:45

బాలీవుడ్‌ కపుల్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ తొలిసారి నటించిన బ్ర‌హ్మాస్త్ర మూవీ సెప్టెంబర్‌ 12న థియేటర్లో విడుదల కానుంది. ఈ మూవీకి విడుదలకు ఇంకా 100 రోజుల మిగిలి ఉండటంతో ప్రమోషన్లో భాగంగా మంగళవారం హీరో రణ్‌బీర్‌, దర్శకుడు ఆయాన్‌ ముఖర్జీ, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి విశాకపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన కొత్త టీజర్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు మేకర్స్‌.

చదవండి: ఆ హీరో ‘మై డార్లింగ్‌’.. తన ఫేవరెట్‌ తెలుగు యాక్టర్‌ ఎవరో చెప్పిన రణ్‌బీర్‌

అంతేకాదు ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను జూన్ 15వ తేదీన రిలీజ్ చేయ‌న్నట్లు ప్రకటించారు. ‘ఇవాళ ప్ర‌త్యేక‌మైన రోజు. 15 రోజుల్లో ట్రైలర్‌, 100 రోజుల్లో సినిమా రిలీజ్‌. అందుకే ఈ రోజు(మంగళవారం మే 31) టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తున్నాం’ అని డైరెక్ట‌ర్ అయాన్ తెలిపాడు. ఇక టీజర్‌ విషయానికి వస్తే.. పూర్తి విజువల్‌ ఫీస్ట్‌గా రూపొందించిన ఈ టీజర్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఇందులోని సన్నివేశాలు నటీనటుల లుక్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

చదవండి: జనవరిలో పెళ్లి ప్రకటన, తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌

ఈ టీజర్‌లో హీరోహీరోయిన్ల పలు సీన్స్‌తో పాటు టాలీవుడ్‌ హీరో నాగార్జున, బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, మౌనీ రాయ్‌లకు సంబంధించిన సీన్స్‌ను కూడా చూపించారు. కాగా ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ అరవింద్‌ చతుర్వేది పాత్రను అమితాబ్‌ బచ్చన్‌ పోషిస్తుండగా.. పురావాస్తూశాఖ నిపుణుడు అజయ్‌ విశిష్ఠ్‌ పాత్రలో నాగార్జున కనిపించనున్నాడు. ఇక మౌనీ రాయ్‌ దమయంతీ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)