రానా నాయుడులో దుమ్ములేపిన భామ గురించి ఈ విషయాలు తెలుసా?

Published on Sun, 06/25/2023 - 10:22

బుల్లితెరపై కనిపిస్తే.. వెండితెర అవకాశాలు తగ్గుతాయనే మాట అసత్యమని ఇప్పటికే చాలామంది నటీనటులు నిరూపించారు! ఆ జాబితాలో బాలీవుడ్‌ నటి సుర్వీన్‌ చావ్లా కూడా ఉంది. దశాబ్ద కాలంగా టీవీ సీరియల్స్‌లో నటిస్తూనే అటు సినిమా అవకాశాలనూ అందుకుంటూ.. ఇప్పుడు వెబ్‌ స్క్రీన్‌ మీదా స్టార్‌గా వెలిగిపోతోంది.  సుర్వీన్‌ చండీగఢ్‌లో జన్మించింది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకుంది.

(ఇదీ చదవండి: గతంలో విడాకులు.. అయితే మళ్లీ ప్రేమను పొందే అర్హత లేదా?: నటి)

దీంతో మొదట మోడలింగ్‌ చేసి ఆ తర్వాత నటిగా మారింది. ‘కహీ తో హోగా’ అనే టీవీ సీరియల్‌తో నటిగా కెరీర్‌ ప్రారంభించింది. అందులో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించడంతో సీరియల్స్‌తోపాటు, సినిమా అవకాశాలూ రావడం మొదలుపెట్టాయి.దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ‘రంగోలీ’ కార్యక్రమానికి దాదాపు ఐదేళ్లు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.కన్నడంలో విడుదలైన ‘పరమేశ పాన్‌వాలా’తో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన రెండో చిత్రంతోనే  మోహన్‌బాబు, శర్వానంద్‌ ‘రాజు.. మహారాజు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  

పలు పంజాబీ, తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించింది. ‘హిమ్మత్‌వాలా’, ‘క్రియేచర్‌ 3డీ’, ‘వెల్‌కమ్‌ బ్యాక్‌’ సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో ఆడిపాడింది సుర్వీన్‌. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో..  లావుగా ఉంటే అవకాశాలు రావంటూ కొందరు నన్ను బాడీ షేమింగ్‌ చేశారు. వాటిని పట్టించుకోలేదు. కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నానని తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పార్చ్‌డ్‌’ సినిమాలో తన ప్రతిభకు పురస్కారం అందుకుంది. ఆ సినిమాలో తను రకుల్‌తో చేసిన కొన్ని సీన్స్‌ వివాదస్పదం అయ్యాయి.  ‘24’ సీజన్‌ 2తో వెబ్‌ దునియాలోకి అడుగుపెట్టి, అక్కడ కూడా వరుస సిరీస్‌లతో దూసుకుపోతోంది.  ప్రస్తుతం నెట్‌ఫిక్ల్స్‌లో ప్రసారంలో ఉన్న ‘రానా నాయుడు’తో వీక్షకులను అలరిస్తోంది. 

(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ.. కంట్రోల్‌లో లేని బరువు? కలవరపడుతున్న ఇలియానా!)

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)