Breaking News

రోషన్‌ని చూస్తుంటే ‘చిరుత’లో చరణ్‌ని చూసినట్లుంది: రానా

Published on Thu, 12/11/2025 - 12:49

‘‘మోగ్లీ 2025’ సినిమాలో రోషన్‌ ను చూస్తుంటే, ‘చిరుత’ సినిమాలో చరణ్‌ని చూసినట్లు నాకు అనిపించింది. రోషన్‌కి ఆల్‌ ది బెస్ట్‌. ‘కలర్‌ఫోటో’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత ‘మోగ్లీ 2025’ సినిమా తీయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని సందీప్‌ బాధపడుతున్నాడు. కానీ, సమయం గడిచిపోతుంది. సినిమాలు నిలిచిపోతాయి. ‘కలర్‌ఫోటో’లానే ‘మోగ్లీ 2025’ సినిమా కూడా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు హీరో రానా. 

రోషన్‌  కనకాల, సాక్షి మడోల్కర్‌ జంటగా, హర్ష చెముడు, బండి సరోజ్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘మోగ్లీ 2025’(Mowgli Movie). సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కృతీప్రసాద్‌  నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రానా ఈ సినిమా టికెట్‌ను కొనుగోలు చేయగా, మరో అతిథిగా హాజరైన దర్శక–నిర్మాత మారుతి ‘మోగ్లీ 2025’ సినిమాలోని హీరో ఇంట్రడక్షన్‌  సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. 

రోషన్‌ మాట్లాడుతూ–‘‘ప్రతి మనిషిలో ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రేమ కోసం ఈ మోగ్లీ చేసిన యుద్ధాన్ని సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘అమెరికా షెడ్యూల్‌లో మాకు కేటాయించిన థియేటర్స్‌ మళ్లీ మాకు దొరకవు కనుక, మరొక రిలీజ్‌ డేట్‌ లేకపోవడం వల్ల ఓ పెద్ద సినిమాతో పాటు వస్తున్నాం’’అని తెలిపారు టీజీ విశ్వప్రసాద్‌. 

‘‘మా సినిమా దారి తప్పదు. ఒక్క శాతం కూడా మిస్‌ కాదు’’అని సందీప్‌ రాజ్‌ అన్నారు. నటులు బండి సరోజ్‌ కుమార్, హర్ష మాట్లాడారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)