Breaking News

తరచూ సమంతతో మాట్లాడుతుంటా: రానా

Published on Sun, 03/05/2023 - 14:42

తరచూ స్టార్‌ హీరోయిన్‌ సమంతతో మాట్లాడుతుంటానని ఆసక్తికర విషయం చెప్పాడు హీరో, నాగ చైతన్య కజిన్‌ దగ్గుబాటి రానా. వెంకటేశ్‌, రానా కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్లో భాగంగా రానా ఇటీవల ఓ జాతీయ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను, పలువురు సినీ సెలబ్రెటీల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 

చదవండి: సీఎం రేంజ్‌లో భారీ బందోబస్తు మధ్య అత్తారింటికి మనోజ్‌.. వీడియో, ఫొటోలు వైరల్‌

ఇందులో భాగంగా నాగ చైతన్య మాజీ భార్య, స్టార్‌ హీరోయిన్‌ సమంతతో ఇప్పటికి తను కాంటాక్ట్‌లో ఉన్నానని చెప్పాడు. ‘సమంత మయోసైటిస్‌ వ్యాధి బారిన పడినట్టు తెలిసిన వెంటనే ఆమెకు ఫోన్‌ చేసి మాట్లాడాను. అంతేకాదు వీలు కుదరినప్పుడల్ల సమంతతో మాట్లాడుతూనే ఉంటా. నటీనటులు తమకు ఉన్న సమస్యల గురించి బయటకు చెప్పాలా? లేదా? అనేది వారి వ్యక్తిగతం. అయితే ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎప్పుడు ఏదో ఓక సమస్య వారిని బాధపెడుతూనే ఉంటుంది. ఎవరి లైఫ్‌ పూలా పాన్పులా ఉండదు.

చదవండి: ఆ వ్యక్తిని చాలా నమ్మాను, కానీ అతడు నా డబ్బు కాజేశాడు: నటి ఆవేదన

ఎలాంటి సమస్య అయినా దాన్ని నువ్వు ఎలా అధిగమిస్తావననేది ముఖ్యం. సమస్య వచ్చినప్పటికీ కంటే దాన్ని ఎదుర్కొని ముందు సాగడంలోనే ఆనందం ఉంది’ అంటూ రానా చెప్పుకొచ్చాడు. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌లో రానా- విక్టరి వెంకటేశ్‌లు తొలిసారి కలిసి నటించారు. కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ ఎస్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ అమెరికన్‌ టీవీ సిరీస్‌ రే డొనోవన్‌కు రీమేక్‌గా రూపొందింది. ఇందులో బాలీవుడ్‌ నటీనటులు సుర్వీన్‌ చావ్లా ఆశిస్‌ విద్యార్థి, గౌరవ్‌ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)