పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మద్యం దుకాణాలు నడుపుతున్నారు: వైఎస్ జగన్
Breaking News
కబడ్డి... కబడ్డి
Published on Wed, 10/15/2025 - 00:12
ప్రముఖ తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘బైసన్’. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. పా. రంజిత్ సమర్పణలో నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్‌పై సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితీ ఆనంద్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో ఈ నెల 17న విడుదల కానుంది. తెలుగులో జగదాంబే ఫిలిమ్స్ పై బాలాజీ ఈ నెల 24న విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రానా రిలీజ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ– ‘‘1990 బ్యాక్‌డ్రాప్‌లో కబడ్డి నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బైసన్’. ట్రైలర్ ఎంత ఆసక్తికరంగా ఉందో సినిమా కూడా థ్రిల్లింగ్ అంశాలతో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ దక్కుతుంది. కబడ్డి నేపథ్యంలో రాబోతున్న మా సినిమా కూడా మంచి విజయం అందుకుంటుందని నమ్ముతున్నాను’’ అన్నారు.
Tags : 1