Breaking News

నమ్రత భర్తగానే మహేశ్‌బాబు తెలుసు: రానా దగ్గుబాటి

Published on Fri, 03/03/2023 - 16:31

విక్టరీ వెంకటేశ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ ఎస్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో వెంకీ, రానా తొలిసారి కలిసి నటించారు. కరణ్‌ అన్షుమాన్‌ నిర్మించిన ఈ సిరీస్‌ మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ క్రమంలో రానా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

'ప్రస్తుతం చాలా తెలుగు సినిమాలు హిందీలో బాగా వర్కవుట్‌ అవుతున్నాయి. అంతెందుకు? నా రెండో సినిమా(ఘాజీ) హిందీలోనే చేశా, తర్వాత మాత్రం తెలుగులోనే వరుస సినిమాలు చేశాను. కానీ మనం అనవసరంగా ఇలా సినిమాను భాష పేరుతో వేరు చేసుకుంటున్నాం. త్వరలోనే ఆ సరిహద్దులు కూడా చెరిపోయే రోజు వస్తుంది. కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన నాకిప్పటికీ గుర్తుంది. చాలాకాలం పాటు నేను బాహుబలి షూటింగ్‌లోనే నిమగ్నమయ్యాను. ఆ సమయంలో బాలీవుడ్‌లోని నా మిత్రుడొకరిని కలిసినప్పుడు బాహుబలి సినిమా గురించి చెప్పాను.

అప్పుడతను అందులో హీరో ఎవరని అడగ్గా ప్రభాస్‌ అని చెప్పాను. దీనికతడు ప్రభాస్‌ ఎవరు? అని తిరిగి ప్రశ్నించాడు. ఓ క్షణం పాటు అవాక్కైన నేను ప్రభాస్‌ నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్పి అతడి గురించి వివరించే ప్రయత్నం చేశాను. కానీ ప్రభాస్‌ సినిమాలు ఏ ఒక్కటీ తను చూడలేదట. అంతేకాకుండా తనకు టాలీవుడ్‌లో చిన్ను భర్త ఒక్కరే తెలుసన్నాడు. చిన్ను ఎవరో అర్థం కాక నేను ఆలోచనలో పడ్డాను. కాసేపటి తర్వాత చిన్ను అంటే నమ్రత శిరోద్కర్‌ అని అర్థమైంది. నమ్రత భర్తగా మహేశ్‌బాబు తెలియడమేంటి? అని నేను షాక్‌ అవ్వాల్సి వచ్చింది. నాలుగైదేళ్లు ఆగు, మా ఆర్మీ అంతా బాలీవుడ్‌లో ల్యాండ్‌ అవుతుందని చెప్పాను. ఇటీవల ఆయన్ను కలిసినప్పుడు నేను చెప్పింది జరగడంతో సంతోషం వ్యక్తం చేశాడు' అని చెప్పుకొచ్చాడు రానా.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)