Breaking News

ప్రతీది రాజకీయమే.. కమల్‌ 'కన్నడ' వివాదంపై రానా రియాక్షన్‌

Published on Thu, 06/05/2025 - 13:27

'తమిళ భాష నుంచే కన్నడ పుట్టింది' అని కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మా భాషను తక్కువ చేసి మాట్లాడతావా? అని ఆయన నటించిన థగ్‌ లైఫ్‌ సినిమా (Thug Life Movie)పై కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (కేఎఫ్‌సీసీ) నిషేధం ప్రకటించింది. అప్పటికీ కమల్‌ వెనక్కుతగ్గలేదు. తన సినిమా కర్ణాటకలో రిలీజ్‌ చేయాలని కోర్టుకెళ్లాడు. అసలు ఏ ఆధారంతో అటువంటి కామెంట్లు చేశారు? సారీ చెప్తే అయిపోతుందిగా అని న్యాయస్థానం చీవాట్లు పెట్టింది.

ఏది మాట్లాడినా వివాదమే..
అప్పటికీ కమల్‌ క్షమాపణ చెప్పడం కాదుకదా.. అసలు కర్ణాటకలో సినిమా విడుదల చేయట్లేదని ప్రకటించాడు. తాజాగా ఈ వ్యవహారం హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)కి వద్ద ప్రస్తావనకు వచ్చింది. రానా నాయుడు- రెండో సీజన్‌ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో కమల్‌- కన్నడిగుల మధ్య రాజుకున్న వివాదం గురించి రానా మాట్లాడుతూ.. అభిప్రాయాలు వ్యక్తం చేసే ప్లాట్‌ఫామ్‌గా సోషల్‌ మీడియా మారిపోయింది. మొదట్లో ఇలాంటి మాధ్యమాలన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ప్రతీది రాజకీయం చేస్తున్నారు అన్నాడు. ఇకపోతే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు రెండో సీజన్‌ జూన్‌ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

చదవండి: మరో ఓటీటీకి వచ్చేస్తోన్న థ్రిల్లర్‌ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్!

Videos

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు