73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
రానా నాయుడు అందరూ చూశారు.. కానీ మన తెలుగు వాళ్లే: రానా దగ్గుబాటి
Published on Thu, 05/22/2025 - 07:20
టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు-2. గతంలో విడుదలైన రానా నాయుడుకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సీజన్-2తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే మొదటి సీజన్‌లో ఎక్కువహా బూతులు ఉన్నాయని ఈ సిరీస్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయినప్పటికీ ఆడియన్స్ నుంచి ఆదరణ దక్కించుకుంది.
తాజాగా ఈ సీజన్ టీజర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో జరిగిన ఈవెంట్‌లో హీరో రానా సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన సీజన్-2పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రానా నాయుడు ప్రపంచం మొత్తం చూసింది.. కానీ మన తెలుగు వాళ్లు మాత్రం చూడలేదని అన్నారు. అయితే ఈ సీజన్-2లో బూతులు తగ్గించి.. వయొలెన్స్ ఎక్కువ పెట్టామని రానా తెలిపారు. కాగా.. ఈ సమావేశానికి బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో అర్జున్ రాంపాల్‌ను తెలుగువారికి పరిచయం చేశారు రానా.
కాగా.. ఈ వెబ్ సిరీస్‌ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రానా నాయుడు పోస్టర్‌ను పంచుకుంది. తాజాగా రిలీజైన రానా నాయుడు సీజన్-2 అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు.
Tags : 1