Breaking News

నరేశ్‌ నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు: రమ్య

Published on Fri, 01/06/2023 - 13:03

సినీ నటుడు నరేశ్‌ కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో నటి పవిత్రా లోకేశ్‌కు దగ్గరైన అతడు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది రమ్య. 'మా ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయని వార్తలు వస్తున్నాయి. అది పూర్తిగా అవాస్తవం. కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది. తను విడాకులు తీసుకుని ఇంకొకరితో సెటిలైపోదామనుకుంటున్నాడు. కానీ మా బాబు మేమిద్దరం కలిసే ఉండాలని కోరుకుంటున్నాడు. వాడి కోసమైనా నేను విడాకులివ్వను. అతడికి పవిత్రతో పెళ్లి జరగనివ్వను.

నరేశ్‌ ఎన్నోసార్లు అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోతే వచ్చి కాళ్లు పట్టుకుని సారీ చెప్పేవాడు, ఏడ్చేవాడు. నేను తల్లిలా క్షమించేదాన్ని. మొన్నటికి మొన్న నరేశ్‌- పవిత్ర లిప్‌లాక్‌ చూసి మీ నాన్న పెళ్లంటగా అని బాబును వాడి ఫ్రెండ్స్‌ ఆటపట్టిస్తున్నారట. పిల్లాడి మనసు గాయపడుతోంది. అతడి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నేను రాఖీ కట్టిన వ్యక్తితో, డ్రైవర్‌తో.. ఇలా చాలామందితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. నన్ను బద్నాం చేస్తున్నాడు. ఇన్ని నిందలు పడుతున్నా కూడా నేను బతికున్నానంటే అది నా కొడుకు కోసమే! 

సమ్మోహనం సినిమా సమయంలో పవిత్ర ఓ సారి ఇంటికి వచ్చింది. పిచ్చిదానిలా నేను ఆమెకు వడ్డించి సరదాగా కలిసిపోయాను. 'మా' ఎలక్షన్స్‌ సమయంలో నాకు తనమీద కొంత అనుమానం మొదలైంది. అతడి బర్త్‌డే రోజు ఇష్టమైన కేక్‌ తీసుకొస్తే కట్‌ చేయకుండా వెళ్లిపోయాడు. తర్వాత పవిత్ర దగ్గరకు వెళ్లి కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నాడు. నా కంట్లో నీళ్లు వస్తే ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనని నరేశ్‌ను హెచ్చరించింది అతడి తల్లి. కానీ ఎప్పుడైతే ఆమె మరణించిందో అతడికి హద్దు లేకుండా పోయింది' అని చెప్పుకొచ్చింది రమ్య.

చదవండి: నరేశ్‌పై సంచలన ఆరోపణలు చేసిన రమ్య

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి