Breaking News

'రాను.. బొంబాయి'కి అంటూనే లక్షల్లో కొల్లగొట్టేశారు

Published on Sun, 03/23/2025 - 09:58

అద్దాల మేడలున్నాయే.. మేడల్లా మంచి చిరాలున్నాయే అంటూనే 'రాను బొంబాయికి రాను'  అనే లిరిక్స్‌తో ఒక  ఫోక్‌ సాంగ్‌ రెండు నెలలుగా నెట్టింట దుమ్మురేపుతుంది. ఈ పాట కోసం రాము రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులకు సోషల్‌మీడియా దద్దరిల్లిపోయింది. అయితే, ఈ పాటను రాము రాథోడ్‌ రచించడమే కాకుండా సింగర్‌ ప్రభతో ఆలపించాడు. శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఈ పాటను వాలి నిర్మించారు. కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. అయితే, ఇప్పటికే వారి అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లోనే 115 మిలియన్లకు పైగానే వ్యూస్‌ సాధించి టాప్‌ వన్‌ మ్యూజిక్‌ వీడియో విభాగంలో కొనసాగుతుంది. భాషతో సంబంధం లేకుండా ఇతరులు కూడా వేలల్లో తమ కామెంట్లతో వారిని ప్రశంసిస్తున్నారు. 

ఈ సాంగ్‌ నిర్మించడం కోసం సుమారు రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశామని రాము రాథోడ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, ఇప్పటి వరకు ఈ సాంగ్‌ వల్ల తమకు సుమారు రూ. 20 లక్షల వరకు ఆదాయం వచ్చిందని చెప్పడం విశేషం. ఈ సాంగ్‌ మీద మిలియన్ల కొద్ది రీల్స్‌ కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ ఏడాదిలో వచ్చిన ఫోక్‌ సాంగ్స్‌లలో ఇది టాప్‌లో ట్రెండ్‌ అవుతుంది.

'సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ' సాంగ్‌ను కూడా  రాము రాథోడ్ రచించడమే కాకుండా ఆలపించాడు కూడా..  2022లో రిలీజైన ఈ పాట 290+ మిలియన్‌ (29 కోట్లకుపైగా) వ్యూస్‌ సాధించింది. అప్పట్లో ఈ సాంగ్‌  యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్‌.. అందుకే ఇదే సాంగ్‌ను ‘మజాకా’ సినిమాలో రీ క్రియేట్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)