Breaking News

సినిమాకు అవార్డులు.. కానీ ఏం లాభం? రూ.22 కోట్ల నష్టం!

Published on Wed, 07/17/2024 - 13:16

'ద లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌'.. 2002లో వచ్చిన ఈ మూవీ జాతీయ అవార్డులు గెలుచుకుంది కానీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించలేకపోయింది. ఫలితంగా ఫ్లాప్‌ జాబితాలో నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించాడు. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వం వహించాడు.

భగత్‌ సింగ్‌పై ఏకంగా ఐదు సినిమాలు
తాజాగా ఈ సినిమా వైఫల్యం గురించి నిర్మాత రమేశ్‌ తరణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'మా సినిమా సరిగా ఆడలేదు. ఎందుకంటే అప్పుడు భగత్‌ సింగ్‌ మీదే ఐదు సినిమాలు తెరకెక్కాయి. అందులో ఒకటి మా సినిమా కంటే వారం ముందు రిలీజైంది. సరిగ్గా అప్పుడే '23 మార్చి 1931: షాహీద్‌' సినిమా కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలతో మాకు పోటీ ఏర్పడింది. భగత్‌ సింగ్‌పై తెరకెక్కిన మరో చిత్రం ఎందుకనో ఆగిపోయింది. రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన మరో మూవీ ఏడాది తర్వాత నేరుగా దూరదర్శన్‌లో విడుదల చేశారు.

రూ.27 కోట్లు ఖర్చు పెట్టాం
భగత్‌ సింగ్‌ సినిమా రిజల్ట్‌తో మా కంపెనీ మొత్తం వణికిపోయింది. ఎందుకంటే రూ.27 కోట్లు పెడితే కేవలం రూ.5 కోట్లు మాత్రమే వెనక్కు వచ్చాయి. రూ.22 కోట్లు నష్టపోయాం. సినిమాకు మంచి గౌరవం దక్కినా నష్టం మాత్రం తీవ్ర స్థాయిలో వాటిల్లింది. రిస్క్‌ చేసింది మేము కాబట్టి ఆ నష్టాన్ని మేమే భరించాం. ఈ మూవీకోసం పని చేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేశాం' అని పేర్కొన్నాడు. కాగా ద లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీలో రెండు జాతీయ పురస్కారాలు అందుకుంది.

చదవండి: భారత్‌ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్‌ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)