Breaking News

'ఆదిపురుష్' ఎఫెక్ట్.. ఆ 'రామాయణం' మళ్లీ రిలీజ్

Published on Wed, 06/28/2023 - 09:49

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా విడుదలై పదిరోజులు దాటిపోయింది. కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. జనాలు ఈ చిత్రం గురించి మాట్లాడుకోవడం మెల్లగా తగ్గించేస్తున్నారు. కానీ వివాదాలు మాత్రం వదలట్లేదు. తాజాగా అలహాబాద్ హైకోర్ట్ చిత్రబృందంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డైలాగ్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదలా ఉండగానే 'రామాయణ్' మరోసారి విడుదలకు సిద్ధమైంది. డేట్ కూడా ఫిక్స్ చేస‍్తూ అధికారికంగా ప్రకటించారు. 

వివాదాలే వివాదాలు!
'ఆదిపురుష్' సినిమాని రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధకాండ ఆధారంగా తీశారు. టీజర్ విడుదలైనప్పుడు రావణుడి గెటప్ వల్ల విపరీతంగా విమర్శలు వచ్చాయి. దీంతో ట్రైలర్స్ లో అతడిని అస్సలు చూపించలేదు. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత రావణుడి కంటే.. గ్రాఫిక్స్, డైలాగ్స్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిపోయాయి. ఇది కాదన్నట్లు డైలాగ్ రైటర్ మనోజ్.. 'ఈ సినిమా రామాయణం కాదు', 'హనుమంతుడు దేవుడు కాదు' లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల‍్లో నిలిచారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్- కె'.. ఆ విషయంలో ఆదిపురుష్‌ను దాటేయనుందా?)

'రామాయణ్' మరోసారి
మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశాడని 'ఆదిపురుష్' డైలాగ్ రైటర్ మనోజ్‌ని చంపేస్తామని కొందరు బెదిరించారు. రామాయణాన్ని వక్రీకరించి ఈ సినిమా తీశారని కొందరు కేసు వేశారు. ఇలా 'ఆదిపురుష్' సినిమాపై లెక్కలేనంత నెగిటివిటీ వచ్చింది. ఈ క్రమంలోనే దయానంద్ సాగర్ 'రామాయణ్' సీరియల్ ని మరోసారి టీవీల్లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. 

ప్రతిరోజూ రాత్రి!
బాక్సాఫీస్ దగ్గర 'ఆదిపురుష్' కాస్త తగ్గిన నేపథ్యంలో 'రామాయణ్' సీరియల్ ని ఆ ఛానెల్ లో జూలై 3 నుంచి ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో పలుమార్లు ఈ సీరియల్ రీ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. లాక్‌డౌన్‌లోనూ ప్రసారం చేస్తే అప్పుడు విశేషాదరణ దక్కింది. 'ఆదిపురుష్' ఎఫెక్ట్ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)