Breaking News

మీ నాన్న గొప్పోడు, కానీ నువ్వేం చేశావ్‌? గోపీచంద్‌ను కడిగిపారేసిన తేజ

Published on Wed, 04/26/2023 - 07:22

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. శ్రీవాస్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీలో డింపుల్‌ హయాతి కథానాయికగా నటిస్తోంది. గోపీచంద్‌ కెరీర్‌లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 5న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మరికొద్ది రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్‌. తాజాగా రామబాణం హీరో గోపీచంద్‌ను ఇంటర్వ్యూ చేశాడు డైరెక్టర్‌ తేజ. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే అతడు పలు విషయాల్లో హీరోను కడిగిపారేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలయ్యతో ప్రకటించిన మూవీ నీ దగ్గరకు ఎలా వచ్చింది? డైరెక్టర్‌ శ్రీవాస్‌తో గొడవలయ్యాయట.. నిజమేనా? అని అడగ్గా.. సినిమాలో లెన్త్‌లు ఎక్కువైపోతున్నాయి. గతంలో ఇలా జరిగిన సినిమాల ఫలితం ఎలా ఉందో చూశాను. అందుకే ఈ విషయంలో డైరెక్టర్‌కు, నాకు చిన్న గొడవలయ్యాయి అని ఒప్పుకున్నాడు గోపీచంద్‌. బాగా నచ్చిన సినిమా ఏదన్న ప్రశ్నకు జయం అని బదులిచ్చాడు.

నీకు ఒక కథ చెప్పాను, ఓకే అన్నావు. హీరోయిన్‌ దొరకలేదు.. మంచి హీరోయిన్‌ను వెతికేలోపు ఇంకో సినిమా మొదలుపెట్టేశావు. మళ్లీ నేను ఫోన్‌ చేస్తే కాల్‌ కూడా లిఫ్ట్‌ చేయలేదు అని తేజ అనగా తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాడు హీరో. అంటే నీ దృష్టిలో తేజ కంటే మరొక డైరెక్టర్‌ బెటర్‌ అని నన్ను పక్కన పడేశావ్‌ కదా, అందుకే ఫోన్‌ ఎత్తలేదు అని విమర్శలు గుప్పించాడు. మీ నాన్నగారు చేసిన మంచిపని వల్ల నీకు జయంలో ఛాన్స్‌ వచ్చింది. మీ నాన్న గొప్పోడు. మరి నువ్వేం పీకావ్‌? అంటూ గోపీచంద్‌ను సూటిగా ప్రశ్నించాడు తేజ. మొత్తానికి ఇంటర్వ్యూలో తన ప్రశ్నలతో గోపీచంద్‌ను ఎన్‌కౌంటర్‌ చేశాడు తేజ.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)