‘ది వారియర్‌’ మరోసారి అది నిరూపించింది: రామ్‌ పోతినేని

Published on Sun, 07/17/2022 - 08:48

‘‘మా ‘ది వారియర్‌’ రిలీజ్‌  సమయంలో వర్షాలు పడుతున్నాయి. సినిమా వాయిదా వేయాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డాం. అయితే ప్రేక్షకులు వస్తారని గట్టిగా నమ్మాం.. మా నమ్మకం నిజమైంది’’ అని రామ్‌ పోతినేని అన్నారు. లింగుసామి దర్శకత్వంలో రామ్‌ పోతినేని, కృతీ శెట్టి జంటగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన చిత్రం ‘ది వారియర్‌’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.

ఈ సందర్భంగా జరిగిన సక్సెస్‌ మీట్‌లో రామ్‌ మాట్లాడుతూ– ‘‘కోవిడ్‌ వచ్చినా, వర్షాలు వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్‌ అని ‘ది వారియర్‌’ మరోసారి నిరూపించింది. ఈ చిత్ర నిర్మాతలతోనే నా తర్వాతి సినిమా ఉంటుంది’’ అన్నారు.

లింగుసామి మాట్లాడుతూ.. నా తొలి తెలుగు చిత్రమిది. రామ్ లాంటి మంచి హీరో, శ్రీనివాసా చిట్టూరి లాంటి నిర్మాత, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, మంచి టెక్నీషియన్స్ నాకు లభించారు. 'పందెం కోడి', 'ఆవారా', 'రన్' సినిమాలను ఎలా రిసీవ్ చేసుకున్నారో... అలా ఈ సినిమాకు చాలా పెద్ద ఆదరణ లభించింది. ఈ ఎనర్జీతో ఇంకా స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను’ అన్నారు. 

ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. పక్కా కమర్షియల్ సినిమాలు ఏమేం కావాలో అవన్నీ 'ది వారియర్'లో ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. చూసిన వారంతా బాగుందని అంటున్నారు. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. వర్షాల్లో సినిమా విడుదలైనా ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. తర్వాత రోజు మరింత పికప్ అయ్యింది. ఇంతటి విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’అని అన్నారు. 

Videos

రైలు ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి

ల్యాప్‌టాప్‌ల కోసం ఎగవడ్డ జనం

జిల్లాల పునర్విభజన వెనుక బాబు మాస్టర్ ప్లాన్!

మందు కొట్టి.. పోలీసులను కొట్టి.. నేవీ ఆఫీసర్ రచ్చ రచ్చ

అల్లు అర్జున్ కు ఓ న్యాయం.. చంద్రబాబుకు ఓ న్యాయమా ?

యూరియాతో పాల తయారీ

ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. ప్రమాదం ఎలా జరిగిందంటే

20 పొట్టేళ్ల తలలు దండ చేసి బాలకృష్ణకు వేస్తే నీకు కనిపించలేదా?

అసెంబ్లీకి గులాబీ బాస్! ఇక సమరమే..!!

మంత్రి నారాయణ ఆడియో లీక్.. రౌడీషీటర్లకు డిసెంబర్ 31st ఆఫర్

Photos

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)