Breaking News

Andhra King Taluka Teaser: ‘ఫ్యాన్‌..ఫ్యాన్‌ అని గుడ్డలు చింపేసుకోవడమే..

Published on Sun, 10/12/2025 - 11:50

రామ్‌ పోతినేని-భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగ్‌ తాలుకా. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ తాజాగా రిలీజైంది. రామ్ పోతినేని ఎనర్జీ, మాస్ డైలాగ్స్‌తో టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. 

ఈ చిత్రంలో హీరో ఉపేద్రకు రామ్‌ వీరాభిమానిగా కనిపించబోతున్నాడు.  చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి.. ఆంధ్ర కింగ్‌ (ఉపేంద్ర)కు వీరాభిమానిగా మారిన హీరోకి వచ్చిన సమస్యలు ఏంటి?  తన హీరో కోసం ఆయన ఏం చేశాడు? అనేది సినిమా కథగా ఉండబోతున్నట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. 

‘సినిమాకు ఎందుకు తీసుకెళ్లావ్‌.. పిల్లాడిని ఇలానే పాడు చేసి పెట్టు.. ’ అని హీరో తల్లి చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభం అవుతుంది. ‘మీ హీరో చెప్పినదానికన్నా.. ఈ హీరో చెప్పిందే బాగా నచ్చింది’, ‘బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ అక్కడ.. నిన్ను నైజాంలో కోసి గుంటూరులో కారం పెట్టి సీడెడ్‌లో ఫ్రై చేజేసి ఆంధ్రాలో పోలావ్‌ వండేస్తే..మొత్తం అయిపోతది’, ‘ఫ్యాన్‌..ఫ్యాన్‌ అని గుడ్డలు చింపేసుకోవడమే కానీ.. నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు. ఏం బతుకులుగా మీవీ.. ఛీ ఛీ’ అని ఓ వ్యక్తి(మురళి శర్మ) చెప్పే డైలాగ్‌ టీజర్‌ ముగుస్తుంది. 

ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. నవంబర్‌ 28 ఈ చిత్రం రిలీజ్‌ కాబోతుంది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)