Breaking News

థియేటర్‌లో సినిమా చూసిన ఆర్జీవీ.. లోకేష్‌ను అలా చూపించానంటూ..

Published on Sun, 03/03/2024 - 17:07

అజ్మల్‌, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వ్యూహం. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈసినిమాను రామధూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్  రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన పరిణామాల సమూహమే వ్యూహం. ఈ చిత్రం మార్చి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

లోకేష్‌ ఎలా ఉంటాడో..
ఆదివారం నాడు ఆర్జీవీ, వ్యూహంలో సీఎం జగన్‌ పాత్రను పోషించిన అజ్మల్‌తో కలిసి విజయవాడకు వెళ్లారు. అక్కడ జైరామ్‌ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూశారు. సినిమా చూసిన అనంతరం రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్ బయట ఎలా ఉంటాడో సినిమాలో అలానే చూపించాను. వైఎస్సార్ చనిపోయినప్పటి నుంచి జగన్ సీఎం అయ్యేవరకూ అంతా ఫస్ట్ పార్ట్‌లో ఉంది. సెకండ్ పార్ట్(శపథం) మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది అని చెప్పారు.

ఎన్నికలపై వ్యూహం ప్రభావం..
హీరో అజ్మల్‌.. సినిమాకు మంచి స్పందన వస్తోందని సంతోషించాడు. నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ నిజాలను నిర్భయంగా తీశారు. గుండె ధైర్యంతో ఎవరికీ భయపడకుండా సినిమా తీశారు. వచ్చే ఎన్నికలపై సినిమా ప్రభావం ఉండబోతోంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా మార్చి 8న శపథం రిలీజ్‌ చేయనున్నారు.

చదవండి: నలుగురమ్మాయిల కష్టాల కథే ఈ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)