Breaking News

నేను ఎవ్వరికి భయపడనని నీకు మట్టుకే తెలుసు: ఆర్జీవీ ట్వీట్ వైరల్!

Published on Fri, 11/03/2023 - 12:43

అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం వ్యూహం. ఈ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. వ్యూహం చూసిన సెన్సార్‌ సభ్యులు రివైజింగ్‌ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. అయితే ఎందుకు రివైజింగ్‌ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదని వెల్లడించారు.

(ఇది చదవండి: నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి)

ఇప్పటికే ఆర్జీవీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 'అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఎన్ని వ్యూహాలు పన్నినా మా ‘వ్యూహం’ను ఆపలేరు అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప సినిమాలోని ఓ డైలాగ్‌తో ఆర్జీవీ ట్వీట్ చేశారు. అందులో అల్లు అర్జున్, సునీల్ మధ్య జరిగిన సీన్‌ మీమ్‍ను షేర్ చేశారు. అందులో పుష్ప క్యారెక్టర్‌లో ఆర్జీవీని చూపించారు. 

ఆర్జీవీ షేర్ చేసిన ట్వీట్‌లో.. 'శీనప్ప.. నేను ఎవ్వడికి భయపడనని నీకు మట్టుకే తెలుసు. కానీ మార్కెట్ మొత్తం తెలియాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? అన్నో.. ఇది ఒకటి తలలో పెట్టుకో ఎప్పటికీ.. నేను నా వ్యూహంతో నీ కెరీర్‌ను గెలకడానికి రాలే. నా వ్యూహంతో నీ వ్యూహం బయటపెట్టడానికి వచ్చినా.. తగ్గేదేలే' అన్న డైలాగ్‌ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. త్వరలోనే వ్యూహం మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ను  ప్రకటిస్తామని  నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ వెల్లడించారు. 

(ఇది చదవండి: దయా వెబ్ సిరీస్ నటి.. మరి ఇంత బోల్డ్‌గా ఉందేంటి బ్రో!)

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)