Breaking News

ప్రకాశ్‌ రాజ్‌కు ఆర్జీవీ మద్దతు.. నాగబాబుకు కౌంటర్‌

Published on Mon, 06/08/2026 - 12:00

సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై కూడా తరచూ స్పందించే ఆర్జీవీ.. తాజాగా జనసేన నేత నాగబాబు, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన సోషల్ మీడియా వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రకాశ్‌ రాజ్‌కు తన మద్దతు తెలుపుతూ పరోక్షంగా నాగబాబుకు చురకలు అంటించాడు.

ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్‌ వేదికగా చేసిన ఓ పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది. ‘నాయకుడి మాటే శిరోధార్యం. ఏది సరైనదో, ఏది కాదో నాయకుడికే తెలుసు. సందేహాలను పక్కనపెట్టి, ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించాలి’ అంటూ పవన్‌ కల్యాణ్‌ ఫోటోని షేర్‌ చేశాడు. 

ఈ ట్వీట్‌ రాజకీయ వర్గాల్లోనే కాదు సోషల్‌ మీడియాలోనూ పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ప్రకాశ్‌ రాజ్‌ స్పందిస్తూ.. ‘మేము గొర్రెలం కాదు, బానిసలమూ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు. ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది’ అని నాగబాబుకు కౌంటర్‌ ఇచ్చాడు. 

ప్రకాశ్‌ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు. అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు’ అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)