Breaking News

కోట శ్రీనివాసరావు మరణం.. ఆ సినిమాను గుర్తు చేసుకున్న ఆర్జీవీ

Published on Sun, 07/13/2025 - 16:26

తెలుగు సినీ ప్రియులను వెండితెరపై అలరించిన కోటా శ్రీనివాసరావు ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ప్రాణం ఖరీదు మూవీతో మొదలైన ఆయన జర్నీ.. వందలకు పైగా చిత్రాల్లో నటించి తనదైన నటనలో అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో తనదైన ముద్రవేశారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

లెజెండరీ నటుడు మరణంతో ఆయనతో ఉన్న క్షణాలను టాలీవుడ్ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ మధుర జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. తాజాగా సంచలన డైరెక్టర్‌గా పేరున్న రాం గోపాల్ వర్మ కోట శ్రీనివాసరావుతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన అనగనగా ఒక రోజు మూవీ సెట్స్‌లో కోటతో ఉన్న ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. అంతకుముందుకోట శ్రీనివాసరావు మృతి పట్ల ఆర్జీవీ సంతాపం వ్యక్తం చేశారు.

నిస్సందేహంగా నేను చూసిన గొప్ప నటులలో కోట శ్రీనివాసరావు ఒకరని ట్వీట్ చేశారు. శివ,గాయం, డబ్బు, సర్కార్, రక్తచరిత్ర లాంటి సినిమాలకు ఆయన చేసిన కృషి గొప్పదని అన్నారు. ఇప్పుడు మీరు వెళ్లిపోయి ఉండవచ్చు.. కానీ మీ పాత్రలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయని ఆర్జీవీ పోస్ట్ చేశారు.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)