Breaking News

నా స్నేహితుడి సినిమా హిట్ అవ్వాలి: ఆర్జీవీ

Published on Tue, 01/23/2024 - 18:33

చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై  కేకేఆర్,  బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి   ఓ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్ వర్మ చేతుల మీదుగా 'నిజమా' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.

అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్  ఎక్స్‌ప్రెస్ చిత్రంలోని  'నిజమా' పాటను ఇప్పుడే చూశా. పాటను చాలా బాగా చిత్రీకరించారు. నేను విడుదల చేయడం ఇంకా సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్తో వస్తోన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి"  అని అన్నారు.  

దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. "రామ్ గోపాల్ వర్మతో బ్యూటీ ఆఫ్ ప్యాషన్, ఆట అనే రెండు చిత్రాలకు పని చేశా. ఆయన చిత్రాలు మా లాంటి దర్శకులకు మంచి స్ఫూర్తి. శివ చిత్రం నాకు దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నా. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. రామ్ గోపాల్ వర్మ మా చిత్రంలోని మొదటి పాట లిరికల్ వీడియోని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)