Breaking News

ఆ సినిమాలు డేంజర్‌, అలాంటివాటి జోలికి వెళ్లడం అవసరమా?: ఆర్జీవీ

Published on Sat, 08/03/2024 - 17:26

ఇతిహాసాల మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అలాగని అన్నీ ఆదరణకు నోచుకోలేదు. అందుకు ఆదిపురుష్‌ బెస్ట్‌ ఎగ్జాంపుల్‌. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడింది. అయితే పురాణాలను ప్రస్తావిస్తూ తెరకెక్కించిన మైథాలజీ యాక్షన్‌ డ్రామా కల్కి 2898 ఏడీని సినీప్రియులు ఎంతగానో ఆదరించారు. ఈ క్రమంలో కల్కికి సీక్వెల్‌ కూడా రానుంది.

డేంజర్‌
ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి జంటగా రామాయణ్‌ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాలపై దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశాడు. పురాణాల మీద సినిమాలు తీయడం డేంజర్‌.. ఎందుకంటే వాటి గురించి జనాలకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. దాన్ని మీరు మరోలా చూపిస్తే అది బెడిసికొడుతుంది. పైగా పురాణాల్లో పేర్కొన్న వ్యక్తులను మన దేశంలో దేవుళ్లుగా పూజిస్తారు. కాబట్టి ఇక్కడ అలాంటి సాహసాలు చేయలేము.

ట్రోలింగ్‌ ఎక్కువ..
ఒకప్పుడు బాబూభాయ్‌ మిస్త్రీ.. సంపూర్ణ రామాయణ వంటి పౌరాణిక సినిమాలు తీశాడు. ఎన్టీ రామారావు కూడా అలాంటి ఎన్నో సినిమాలు చేశాడు. వాటిని ఇప్పటికీ అందరూ ఇష్టపడతారు, గౌరవిస్తారు. వాళ్ల వేషధారణను చూసి చేతులెత్తి మొక్కుతారు కూడా! అదే ఆదిపురుష్‌ను తీసుకోండి. అందులో లంకేశ్‌గా సైఫ్‌ అలీ ఖాన్‌ లుక్‌, హనుమాన్‌ లుక్‌ మీద ఎంత రచ్చ జరిగిందో.. ఇలా పదేపదే విమర్శలు వెల్లువెత్తినప్పుడు ఈ తరహా జానర్‌పై సినిమాలు తీయడం చాలా డేంజర్‌.

చూసే విధానమే మారిపోయింది
నేనేమంటానంటే.. కొత్త కథను తీసుకుని దానికి రామయణ అనే పేరు పెట్టకుండా తీయండి. ఇప్పుడు ఆదిపురుష్‌.. ప్రభాస్‌ సినిమా అంటే జనాలు ఒకలా ఆలోచిస్తారు. అది రామాయణం అంటే జనాల ఆలోచన మరోలా ఉంటుంది. ఇలాంటి సున్నిత అంశాల జోలికి వెళ్లడం అవసరమా? ఏదేమైనా ధైర్యం చేసి మరీ ఇలాంటి మూవీస్‌ తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నవారికి ఆల్‌ ద బెస్ట్‌ చెప్తున్నాను అన్నాడు.

చదవండి: తన సినిమా చూసి షాకైన డైరెక్టర్‌.. తనకు తెలియకుండానే మార్చేశారు!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)