కన్నప్పపై 'ఆర్జీవీ' ట్వీట్‌.. మంచు విష్ణు రియాక్షన్‌

Published on Sat, 06/28/2025 - 18:02

మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప సినిమాపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌  27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న కన్నప్ప చిత్రాన్ని తాజాగా చూసినట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు. ఈ మూవీపై తన అభిప్రాయాన్ని వాట్సప్‌ ద్వారా మంచు విష్ణుతో పంచుకున్నారు. అయితే, ఇదే విషయాన్ని విష్ణు సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఆర్జీవీ పంపిన మెసేజ్‌ను కూడా స్క్రీన్‌ షాట్‌ తీసి షేర్‌ చేశారు.

కన్నప్ప సినిమా చూశానంటూ ఆర్జీవీ ఇలా మెసేజ్‌ చేశారు. 'మొదటి నుంచి నాకు దేవుడు, భక్తి వంటి అంశాలపై నమ్మకం లేదు. ఈ కారణం వల్లే భక్తితో వచ్చే సినిమాలను నేను చూడలేదు. అయితే, నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో భక్త కన్నప్ప మూవీని నాలుగుసార్లు చూశాను. కానీ, ఆ సినిమాలో నటించిన నటీనటుల కోసమే చూశాను. ఇప్పటి కన్నప్ప సినిమా విషయానికొస్తే తిన్నడుగా నువ్వు అద్భుతంగా నటించావు అనడం కంటే జీవించేశావ్‌ అని చెప్పడం కరెక్ట్‌. ఆలయంమంత భక్తితో ఉన్న వ్యక్తిలా వెండితెరపై కనిపించావు. కొన్ని సీన్లు చూస్తున్నప్పడు నీ నటన అద్భుతం.. ఒక్కోసారి ఊపిరి తీసుకోనివ్వలేదే కూడా.. సినిమా క్లైమాక్స్‌లో శివలింగం నుంచి వచ్చే రక్తాన్ని ఆపేందుకు తిన్నడు తన రెండు కళ్లను సమర్పించే సీన్‌లో నీ నటన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది.

నేనొక నాస్తికుడిని. ఇలాంటి సన్నివేశాలు పెద్దగా నచ్చవు. కానీ, నీ నటనతో నన్ను మార్చేశావ్‌.. వాటిని ఇష్టపడేలా చేశావు. శివభక్తుడిగా నువ్వు నటించిన ఈ రోల్‌ ఎప్పికటికీ మాస్టర్‌క్లాస్‌గా నిలుస్తోంది. సినిమా చివరి సీన్‌లో నీవు పలికించిన భావోద్వేగాలు పతాకస్థాయికి చేరుతాయి. అప్పుడు ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.' అని విష్ణుకు వాట్సాప్‌లో ఆర్జీవీ మెస్సేజ్‌ చేశారు. తన సినిమాపై ఆర్జీవీ చూపిన ప్రేమకు మంచు విష్ణు కూడా ఇలా రియాక్ట్‌ అయ్యారు. 'రామూ గారు.. మీరు నన్ను ఏడిపించేశారు. చాలా రోజులుగా నా కన్నీళ్లను ఆపుకొంటున్నా. ఈ సినిమా నా జీవితంలో అత్యంత సవాల్‌తో కూడుకుంది. ఇప్పటి వరకు చాలామంది ఈ ప్రాజెక్ట్‌పై ద్వేషాన్నే చూపారు. కానీ, నమ్మకంతో ముందుకు వెళ్లాను.' అని ఆయన అన్నారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)