Breaking News

ఆ సినిమాలో మోహన్‌లాల్‌ నటన నాకు నచ్చలేదు.. కానీ: రాం గోపాల్ వర్మ

Published on Fri, 02/21/2025 - 18:34

టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2002లో ఆర్జీవీ మూవీలో మోహన్‌ లాల్ కీలక పాత్రలో నటించారు. ‍‍అజయ్ దేవగణ్, మనీషా కొయిరాలా జంటగా నటించిన కంపెనీ అనే మూవీలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాంగోపాల్ వర్మ మోహన్‌ లాల్ నటన గురించి వివరించారు. తన సినిమాలో ఎక్కువ రీటేక్‌లు తీసుకున్నాడని అన్నారు. 
 

ఆర్జీవీ మాట్లాడుతూ.. ' నా సినిమా కంపెనీ కోసం మొదటిసారి మోహన్ లాల్‌ను కలిశా. నా సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడా. తన పాత్ర గురించి చాలా క్లిష్టమైన ప్రశ్నలు అడిగుతాడేమోనని నేను ముందుగానే సిద్ధం అయ్యా. కథ మొత్తం చెప్పడం పూర్తయిన తర్వాత అతను నన్ను అడిగిన ఏకైక ప్రశ్న ఇదే. సార్, మీకు ఎన్ని రోజులు కావాలి? అన్నారు. ఇలాంటి క్లైమాక్స్ నేను ఊహించలేదు. నాతో మాత్రమే కాదు.. అందరితోనూ ఆయన ఇలానే చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే అతనికి సినిమాల గురించి పూర్తి అవగాహన ఉంది. డైరెక్టర్‌ నమ్మకానికి తగినట్లుగా ఏ పాత్రనైనా చేస్తాడని భావించా' అని తెలిపారు.

కంపెనీ షూటింగ్ గురించి ఆర్జీవీ మాట్లాడుతూ.. 'ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు మోహన్ లాల్ ప్రదర్శన పట్ల నేను అసంతృప్తిగా ఉన్నా. అతను సరిగ్గా చేయడం లేదని అనుకున్నా. ఆయన ఓ సీన్‌లో ఎక్కువ టేక్‌లు అడుగుతూనే ఉన్నాడు. దాదాపు ఆరు, ఏడు టేక్‌ల తర్వాత వాటిని చెక్ చేశా. ఆ తర్వాత తెలిసింది. మొదటి టేక్‌లోనే అద్భుతంగా చేశాడనిపించింది. నిజంగా మోహన్ లాల్ సహ నటుడు.' అంటూ కొనియాడారు. కాగా.. 2002లో వచ్చిన కంపెనీ చిత్రంలో మోహన్‌లాల్.. వీర్‌పల్లి శ్రీనివాసన్ అనే ఐపీఎస్ పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషించాడు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)