ఎనిమిదేళ్లుగా ఒకే షర్ట్‌ వాడుతున్న రామ్‌ చరణ్‌.. పిక్‌ వైరల్‌!

Published on Sun, 01/07/2024 - 13:35

సాధారణంగా సిసీ సెలెబ్రెటీలకు ఖరీదైన డ్రెస్సులు..కొత్త కొత్త వాచీలు, షూలు ధరించడం అలవాటు. కొంతమంది బడా హీరోహీరోయిన్లు అయితే.. కోట్లు విలువ చేసే వాచీలను సైతం ధరిస్తుంటారు. ఇక డ్రెస్సుల గురించి చెప్పనక్కర్లేదు. ట్రెండ్ ఫాలో అవుతూ షా ఖరీదైన దుస్తులను వాడుతుంటారు.  ఒక్కసారి ధరించిన డ్రెస్‌ని కొన్ని వారాల వరకు ధరించరు. కొంతమంది అయితే రోజుకో డ్రెస్‌ మారుస్తుంటారు.

కానీ మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ మాత్రం ఓ షర్ట్‌ని ఎనిమిది ఏళ్లుగా వాడుతున్నాడు.  2016లో కొన్న ఆ షర్ట్‌ని ఇప్పటికే ధరిస్తున్నారు. తాజాగా డైరెక్టర్‌ బుచ్చిబాబుతో కలిసి దిగిన ఫోటోలో సైతం చెర్రీ ఆ షర్ట్‌తోనే కనిపించాడు. దీంతో ప్రస్తుతం చెర్రీ షర్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. 

(చదవండి: వాళ్లు హర్ట్ అయ్యారు.. హీరోయిన్ నయనతార భర్తకు నోటీసులు!)

2016లో ‘ధృవ’ సినిమాలో చరణ్‌ ఆ షర్ట్‌తో కనిపించాడు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో..ప్రమోషన్స్ సమయంలోనూ అదే షర్ట్ ధరించి కనిపించారు. అలాగే లాక్ డౌన్ సమయంలోనూ అదే షర్ట్ చాలా సార్లు ధరించి కనిపించారు.  2016 నుంచి 2024 వరకు ఏ  ఏ సందర్భంలో చరణ్‌ ఆ షర్ట్‌ని ధరించారో తెలుపుతూ ఓ ఫోటోని క్రియేట్‌ చేసి దాన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. చరణ్‌ సింప్లిసిటీ చూసి మెగా ఫ్యాన్స్‌తో పాటు మిగతా నెటిజన్స్‌ కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చరణ్‌ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా ఈ ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)