Breaking News

'గేమ్ ఛేంజర్' ఆలస్యం.. మనసు మార్చుకున్న చరణ్?

Published on Sun, 07/14/2024 - 10:03

'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ హీరోగా చేసిన మూవీ 'గేమ్ ఛేంజర్'. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం షూటింగ్ మొదలుపెడితే ఇప్పటికీ సెట్స్ మీదే ఉంది. డైరెక్టర్ శంకర్ ఈ సినిమా చేస్తూ మరోవైపు 'భారతీయుడు 2' తీయాలనుకోవడం వల్ల మొదటికే మోసం వచ్చి పడింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన భారతీయుడు సీక్వెల్ ఘోరమైన టాక్ తెచ్చుకుంది. దీంతో చరణ్-శంకర్ మూవీపై సందేహాలు తలెత్తాయి. కానీ అలాంటిదేం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ సముదాయించుకుంటున్నారు.

(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు)

ఇకపోతే 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతున్నా సరే చాలా ఓపిగ్గా చేస్తూ వచ్చిన రామ్ చరణ్.. ఓ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడట. తొలుత ఈ మూవీ నుంచి వచ్చే లాభాల్లో షేర్  తీసుకుందామని ఫిక్స్ అయ్యాడట. కానీ ఆలస్యమయ్యే కొద్ది నిర్మాత వడ్డీల భారం పెరుగుతుందని తెలిసి తన నిర్ణయాన్ని చరణ్ మార్చుకున్నాడట.

పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్న 'గేమ్ ఛేంజర్' కోసం రామ్ చరణ్‌కి రూ.90 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. షేర్ బట్టి చూస్తే ఇది కాస్త తక్కువ మొత్తమే అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తయింది. మరో 15 రోజులు షూట్ పూర్తి చేస్తే అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇకపోతే ఈ ఏడాది దీపావళి లేదా క్రిస్మస్‌కి 'గేమ్ ఛేంజర్'.. థియేటర్లలో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. కొన్నిరోజులు ఆగితే గానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు.

(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!)

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)