ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. ఆడియన్స్‌ను కంటతడి పెట్టిస్తోన్న ఆ సీన్!

Published on Fri, 12/27/2024 - 20:29

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను సొంతం చేసుకుని ప్రపంచమంతా తెలుగు సినిమావైపు చూసేలా చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ నటనతో అభిమానులను కట్టిపడేశారు. 2022లో మార్చి 25 విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు.  పీరియాడిక్‌ యాక్షన్‌ చిత్రంగా హిట్‌ కొట్టిన ఈ చిత్రంలో అలియాభట్‌, ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌,  సముద్రఖని, శ్రియ, అలీసన్‌ డూడీ, దివంగత నటుడు రే స్టీవెన్‌ సన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు.  ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ సృష్టించింది.

అయితే ఈ మూవీ జర్నీపై ఆర్ఆర్ఆర్ మేకర్స్ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని 'ఆర్ఆర్ఆర్‌- బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈనెలలోనే థియేటర్లలో విడుదల చేశారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే ఈ డాక్యుమెంటరీలోని ఓ సన్నివేశం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్‌ను కొరడాతో కొట్టిన సీన్‌ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇందులో ఎన్టీఆర్‌ను రామ్ చరణ్ కొరడాతో కొడతాడు. కానీ వెంటనే ఎక్కడ జూనియర్‌కు దెబ్బ తగిలిందేమోనని దగ్గరికి వచ్చిన గట్టిగా హత్తుకుంటాడు. దీనికి సంబంధించిన వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ స్నేహంపై కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ ప్రాణ మిత్రులని పోస్టులు పెడుతున్నారు.

 

 

 

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)