Breaking News

ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో...

Published on Fri, 11/03/2023 - 01:47

రామ్‌ చరణ్‌కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ‘ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ (ఆస్కార్‌ కమిటీ) తాజాగా వెల్లడించిన ‘మెంబర్‌ క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌’ జాబితాలో రామ్‌చరణ్‌కి సభ్యత్వం దక్కింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకుగాను చరణ్‌కి ఈ స్థానం లభించింది. కాగా ‘ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ ఆ మధ్య విడుదల చేసిన యాక్టర్స్‌ బ్రాంచ్‌లో  తెలుగు నుంచి ఎన్టీఆర్‌కి చోటు దక్కిన విషయం తెలిసిందే.

తాజాగా రామ్‌చరణ్‌తో పాటు మరికొందరు హాలీవుడ్‌ నటీనటులకు ఈ కమిటీలో చోటు దక్కింది. ‘‘ఈ నటులు వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణం పోశారు.

వారి కళతో సాధారణ సినిమాతో ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. అలాంటి వారిని ‘యాక్టర్స్‌ బ్రాంచ్‌’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అని సోషల్‌ మీడియా వేదికగా ఆస్కార్‌ అకాడమీ ప్రతినిధులు షేర్‌ చేశారు. కాగా 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)