Breaking News

శూర్పణఖగా ప్రియాంక అవుట్‌.. రకుల్‌తో డీల్‌?

Published on Fri, 06/13/2025 - 14:06

ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రాల్లో రామాయణ్‌ (Ramayan Movie) ఒకటి. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సాయిపల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ స్టార్‌ యశ్‌ రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. నితేశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇదివరకే మొదలైంది. వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని, 2027లో రెండో భాగాన్ని రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ఆలోచిస్తున్నారు.

ప్రియాంక అవుట్‌
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రావణుడి చెల్లెలు శూర్పణఖ పాత్ర కోసం స్టార్‌ హీరోయిన్లను సంప్రదించారట! మొదట ఈ అవకాశం గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాను వరించిందట. కానీ, తన చేతిలో ఉన్న ‍ప్రాజెక్టులతో ఆమె ఫుల్‌ బిజీగా ఉందట. దీంతో రామాయణ్‌ చిత్రయూనిట్‌.. ప్రియాంకను వదిలేసి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను శూర్పణఖ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం కంటే సంతోషం ఇంకేముంటుందని రకుల్‌ వెంటనే రామాయణ్‌కు ఓకే చెప్పినట్లు భోగట్టా!

రామాయణ్‌..
ఈ క్రమంలో ఆమెకు లుక్‌ టెస్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. రామాయణ్‌ విషయానికి వస్తే సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు. ఇక ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం రాజమౌళి- మహేశ్‌బాబు (SSMB29) సినిమాతో బిజీగా ఉంది. అటు రకుల్‌.. చివరగా మేరే హజ్బెండ్‌ కీ బీవీ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్‌ 3, దేదే ప్యార్‌ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.

చదవండి: కూతురి బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)