Breaking News

రామాయణంలో రకుల్‌.. ఆ పాత్రకు సెట్‌ అయ్యేనా?

Published on Sat, 02/10/2024 - 18:31

రకుల్‌ ప్రీత్‌ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్‌లో ఈ పేరు మారుమ్రోగింది. వరుస సినిమాల్లో నటిస్తూ తక్కువ సమయంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ మొదలు రవితేజ లాంటి స్టార్‌ హీరోల వరకు అందరితో రకుల్‌ నటించింది. ఇక్కడ వచ్చిన ఫేమ్‌తో బాలీవుడ్‌కు చక్కెసింది. అక్కడ అనుకున్న స్థాయిలో క్లిక్‌ కాలేదు. ఇటీవల అయితే ఈ బ్యూటీకి అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ ఒక్క సినిమా లేదు. తాజాగా తమిళ్‌లో అలయాన్‌ సినిమాతో ఓ మోస్తరు కమర్షియల్‌ హిట్‌ అందుకుంది. అయినా కూడా ఈ బ్యూటి చేతికి పెద్ద ప్రాజెక్టులు రాలేదు. దీంతో  వెస్‌ సిరీస్‌ల మీదనే ఎక్కువ దృష్టిపెట్టింది. ఇక వెండితెరకు రకుల్‌ దూరమైనట్లే అనుకుంటున్న సమయంలో ఓ క్రేజీ న్యూస్‌ బయటకు వచ్చింది. ఓ భారీ పాన్‌ ఇండియా సినిమాలో రకుల్‌ నటించబోతుందని ఆ వార్త సారాంశం. 

(చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు!)

బాలీవుడ్‌ దర్శకుడు నితేశ్‌ తివారి రామాయణాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి నిర్మాత అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కాస్టింగ్‌ పనులు ప్రారంభం అయ్యాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నటించబోతున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి లేదా జాన్వీ కపూర్‌ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ అంగీకారం తెలిపాడు.

తాజాగా మరో కీలకమైన పాత్ర కోసం మేకర్స్‌ రకుల్‌ని సంప్రదించారట. రామాయణంలో కీలకమైన శూర్పణఖ పాత్రను రకుల్‌ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్‌ ఆమెను సంప్రదించగా..వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే లుక్‌ టెస్ట్‌ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది.  ఇక ఈ సినిమాలో రావణుడిగా యష్‌, విభీషణుడిగా విజయ్‌ సేతుపతి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)