Breaking News

ప్రియుడిని పెళ్లాడిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Published on Wed, 02/21/2024 - 16:05

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లికూతురిగా ముస్తాబైంది. మనసిచ్చినవాడితో మనువాడింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో బుధవారం (ఫిబ్రవరి 21న) మధ్యాహ్నం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్‌ కరాజ్‌ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి కన్నుల పండుగ్గా జరిగింది. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ మరోసారి ముచ్చటగా పెళ్లి చేసుకోనున్నారు. 

మూడు రోజుల నుంచే సంబరాలు
ఫిబ్రవరి 19 నుంచే వీరి పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. వీరి హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. హీరో వరుణ్‌ ధావన్‌, హీరోయిన్‌ శిల్పాశెట్టి- రాజ్‌ కుంద్రా దంపతులు సహా తదితరులు సంగీత్‌లో స్టెప్పులేశారు. తాజాగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ తారలు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అప్పుడే లీక్‌ చేసింది
కాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన ప్రేమ విషయాన్ని 2021 అక్టోబర్‌లో బయటపెట్టింది. అప్పటినుంచి ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ బ్యూటీ కెరీర్‌తో పాటు పర్సనల్‌ లైఫ్‌పైనా ఫోకస్‌ చేసింది. ఇన్నాళ్లకు ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె ఇండియన్‌ 2 సినిమా చేస్తోంది. జాకీ భగ్నానీ విషయానికి వస్తే అతడు నిర్మించిన బడే మియా చోటే మియా సినిమా ఈద్‌ పండగకు థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

చదవండి: సద్గురు హాలీవుడ్ ఎంట్రీ.. జెన్నిఫర్ ‍లోపెజ్‌ సినిమాలో అలా!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?