Breaking News

నా తొలి రెమ్యునరేషన్‌ ఇదే: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Published on Tue, 02/20/2024 - 07:29

ర‌కుల్ ప్రీత్ సింగ్ పంజాబీ కుటుంబానికి చెందిన ఈ బ్యూటీ గిల్లి అనే కన్నడ సినిమాతో 2009లో మొదటిసారి వెండితెరపై మెరిసింది. టాలీవుడ్‌లో కెరటం అనే చిన్న సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో బ్రేక్‌ అందుకుంది. ఆ తర్వాత తన టాలెంట్‌తో సౌత్‌ ఇండియాలోని అన్ని భాషల్లో నటిస్తూనే బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అలా మోడలింగ్‌ నుంచి హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందే స్థాయికి రకుల్‌ చేరుకుంది. 

ర‌కుల్ ప్రీత్ సింగ్ త్వ‌ర‌లో త‌న ప్రియుడు బాలీవుడ్ అగ్ర నిర్మాత జాకీ భగ్నానీతో క‌లిసి పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే.  ఈ నెల 21న గోవాలో వారి వివాహం ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో ఆమె జర్నీని ఒక ఇంటర్వ్యూలో గుర్తు  చేసుకుంది. జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు వెన్నంటి ఉండి సాయం చేసే వ్యక్తులు మన చుట్టూ లేకుంటే సమస్యలు తలెత్తుతాయని ఆమె తెలిపింది.

'నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజు నుంచి నాకు 25 ఏళ్లు వచ్చే వరకు మా అమ్మ ఎప్పుడూ తోడుగా నిలిచింది. నా కెరియర్‌ మోడలింగ్‌తోనే ప్రారంభమైంది. అలా నేను మొదట అందుకున్న రెమ్యునరేషన్‌ రూ.5 వేలు.. అక్కడి నుంచి నేడు ఈ స్థాయికి చేరుకున్నానంటే అందుకు ప్రధాన కారణం నా తల్లిదండ్రులు, సన్నిహితులు మాత్రమే.. నా వెంట వాళ్లు లేకుంటే ఎన్నో సమస్యలు ఫేస్‌ చేయాల్సి వచ్చేది.' అంటూ రకుల్‌ తెలిపింది. ప్రస్తుతం రకూల్‌ మేరీ పత్నీ కా రీమేక్‌, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)