Breaking News

హైదరాబాద్‌ ఇల్లు గిఫ్ట్‌!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్‌ ప్రీత్‌సింగ్‌

Published on Mon, 06/02/2025 - 10:55

సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల నుంచి మొదలుపెడితే సెలబ్రిటీల పర్సనల్‌ విషయాల వరకు అన్నింటిపైనా ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. కొందరు వాటిని లైట్‌ తీసుకుంటే మరికొందరేమో వాటిపై స్పందించి నిజానిజాలు ప్రేక్షకులకు తెలియజేస్తుంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల రిలేషన్స్‌ గురించి ఎన్నో పుకార్లు వస్తుంటాయి. వారిచ్చిపుచ్చుకునే కానుకల గురించైతే చెప్పనక్కర్లేదు.

హైదరాబాద్‌ ఇల్లు గిఫ్ట్‌?
అలా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌  (Rakul Preet Singh) గురించి కూడా ఓ గాలి వార్త అప్పట్లో బాగా వైరల్‌ అయింది. హైదరాబాద్‌లో ఆమె ఉంటున్న ఇల్లు తను సంపాదించింది కాదని, ఎవరో రాజకీయ నాయకుడు ఆమెకు కానుకగా ఇచ్చాడన్నది సదరు వార్త సారాంశం. ఈ రూమర్‌ గురించి రకుల్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. 'హైదరాబాద్‌లోని ఇల్లు ఎవరో నాకు గిఫ్ట్‌ ఇచ్చారన్న వార్త చూసి మా నాన్న చాలా ఆగ్రహానికి గురయ్యాడు. 

నా కష్టార్జితం..
నిజానికి ఆ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ పనులన్నీ నాన్నే స్వయంగా చూసుకున్నాడు. అలాంటిది ఆ ఇల్లు మా సొంతం కాదన్న వార్త చూడగానే భరించలేకపోయాడు. ఏంటిది? నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్న ఇల్లు ఎవరో బహుమతిగా ఇచ్చారని ఎలా అంటారు? అని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఇలాంటి పనికిరాని పుకార్లకు మనం స్పందించాల్సిన అవసరం లేదని నచ్చజెప్పాను. నాన్నేమో.. రిప్లై ఇవ్వాల్సిందే అంటాడు. ఇలాంటి చెత్త రూమర్లను పట్టించుకోనక్కర్లేదని నాన్నను ఎలాగోలా సముదాయించాను' అని రకుల్‌ చెప్పుకొచ్చింది.

సినిమా
రకుల్‌ ప్రీత్‌.. 'కెరటం' సినిమాతో తెలుగులో తన ప్రయాణాన్ని ఆరంభించింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, పండగ చేస్కో, కిక్‌ 2, సరైనోడు, ధృవ, రారండోయ్‌ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో.., జయ జానకి నాయక, చెక్‌, ఇండియన్‌ 2 వంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్‌పైనే ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం ఇండియన్‌ 3, దేదే ప్యార్‌ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.

చదవండి: అలాంటి వారు పక్కకెళ్లి ఆడుకోండి.. హేటర్స్‌కు ధనుశ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)