Breaking News

ఆ సినిమాలను తీసుకోని ఓటీటీలు.. అదే కారణమా?

Published on Tue, 06/18/2024 - 19:26

777 చార్లీ, సప్త సాగరాలు దాటి  వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు దగ్గరైన శాండల్‌వుడ్‌ హీరో, డైరెక్టర్ రక్షిత్ శెట్టి. తాజాగా ఆయన ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్‌ సీరిస్‌ త్వరలోనే విడుదల కానుంది. ఈ సిరీస్‌ రిలీజ్‌ చేసేందుకు దాదాపు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఏ ఓటీటీ వేదికలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో రక్షిత్ శెట్టి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ సినిమాలకు విలువ లేదా అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు.

రక్షిత్ శెట్టి తన ట్వీట్‌లో రాస్తూ..'జనవరి 2020లో ఏకమ్‌ సిరీస్‌ రిలీజ్ చేద్దామనుకున్నాం.  కన్నడలో వెబ్ సిరీస్‌‌కి అదే సరైన సమయం అనిపించింది. ఆ తర్వాక కరోనా మహమ్మారి అంతా తలకిందులైంది. దీంతో మే ఏకం సిరీస్‌ వాయిదా వేసుకున్నాం. అక్టోబర్ 2021లో ఏకమ్  ఫైనల్ కాపీ చూశాను. అది చూసి థ్రిల్ అయ్యాను. ఆ తర్వాత దాన్ని ప్రపంచానికి చూపించడానికి రెడీ అయ్యాను. కానీ గత రెండేళ్లలో ఏకం సిరీస్‌ కోసం మేము ప్రయత్నించని ఓటీటీ లేదు. ప్రతిసారీ మాకు నిరాశే ఎదురైంది. ఏదేమైనా కంటెంట్‌  సత్తాను నిర్ణయించే హక్కు ప్రేక్షకులకు మాత్రమే ఉందని నమ్మాను. అందుకే మా సొంత వేదికపై తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఇది ఒక  ప్రయత్నం మాత్రమే. దీనిని అందరు గుర్తించి మెచ్చుకోవాలి.' అని రాసుకొచ్చారు. అయితే కన్నడ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం మొదటిసారి కాదని రక్షిత్ శెట్టి అన్నారు. 

కన్నడ పరిశ్రమ కంటెంట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఎందుకు తీసుకోవడం లేదన్న విషయంపై కన్నడ డైరెక్టర్ అనూప్ భండారి మాట్లాడారు. 2022కి ముందు కన్నడ కంటెంట్‌ కొనుగోలు చేయడంలో విముఖత ఉన్న మాట నిజమే.. కానీ.. ఆ ఏడాది నుంచే కన్నడ సినిమాకు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. కాంతార, కేజీఎఫ్ లాంటి సినిమాలతో కన్నడ చిత్ర పరిశ్రమకు గుర్తింపు దక్కిందన్నారు.

అయితే కన్నడ సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకం కొంతవరకు కోల్పోయామని గతంలోనే సప్త సాగరాలు దాటే ఎల్లో మూవీ దర్శకుడు హేమంత్ రావు అన్నారు. కన్నడ కంటే మలయాళం, హిందీ, తమిళ, తెలుగు కంటెంట్‌కే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు.  కన్నడ కంటెంట్‌ను ఎందుకు కొనుగోలు చేయడం లేదో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  తెలుగు సినిమా కర్ణాటకతో పాటు మలయాళంలో కూడా మంచి బిజినెస్ చేస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంలో ఒక్క శాండల్‌వుడ్‌లో మాత్రమే వెనక ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో తెలుగు సినిమాలకు వస్తున్న కలెక్షన్స్‌ కన్నడ చిత్రాలకు రావడం లేదని వెల్లడించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)