Breaking News

అందుకే రక్షణ టైటిల్‌ పెట్టాం: ప్రణదీప్‌ ఠాకోర్‌

Published on Fri, 06/07/2024 - 01:02

‘‘ఓ పోలీసాఫీసర్‌ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకుని కల్పిత కథతో ‘రక్షణ’ తీశాను. ఈ సినిమాలో చిన్న సందేశం కూడా ఉంది. సినిమా మొత్తం ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లా ఉంటుంది. బాధితుల కోసం పోరాడటంతో పాటు వారిని రక్షించేలా ఉంటుంది కాబట్టి ‘రక్షణ’ అని టైటిల్‌ పెట్టాం’’ అన్నారు దర్శక–నిర్మాత ప్రణదీప్‌ ఠాకోర్‌. పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘రక్షణ’. ప్రణదీప్‌ ఠాకోర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ప్రణదీప్‌ ఠాకోర్‌ మాట్లాడుతూ– ‘‘గుణశేఖర్‌గారి వద్ద ‘ఒక్కడు, సైనికుడు, రుద్రమ దేవి’ సినిమాలకు అసిస్టెంట్‌ కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆనంద్‌ రంగా ‘ఓయ్‌’ చిత్రానికి, భాస్కర్‌ ‘ఆరెంజ్‌’ సినిమాకి కో–డైరెక్టర్‌గా చేశాను. ఓ పెద్ద కథ పట్టుకుని చాలామంది వద్దకు వెళ్లాను... కానీ కుదరలేదు. అందుకే చిన్న సినిమా తీసి, నిరూపించుకోవాలని ‘రక్షణ’ తీశాను. ఇందులో పాయల్‌ అద్భుతంగా నటించారు. ‘రక్షణ’ తర్వాత ఆమెకు మరింత పవర్‌ఫుల్‌ రోల్స్‌ వస్తాయి. సినిమా తీయడం క్రియేటివ్‌... రిలీజ్‌ చేయడం మార్కెటింగ్‌ థింగ్‌. నేను సినిమా బాగానే తీశా. కానీ, మార్కెటింగ్‌లో పూర్‌. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్‌ చేయడమే కష్టంగా మారింది’’ అన్నారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)