రెండుసార్లు పెళ్లి.. విడాకులు.. మరోసారి లవ్‌లో పడ్డ రాఖీ

Published on Wed, 06/14/2023 - 18:55

బిగ్‌బాస్‌ షోతో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది నటి రాఖీ సావంత్‌. షో ముగిసిన తర్వాత కూడా ఆ పాపులారిటీని అలాగే కాపాడుకుంది. తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారింది. ఇటీవలే తన భర్తతో తెగదెంపులు చేసుకున్న ఆమె మరోసారి ప్రేమలో పడిందట! ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది. 'నాకు ఒకరు పరిచయం అయ్యారు. అతడు చాలా మంచి వ్యక్తి. కానీ అతడితో జీవితాన్ని పంచుకోవడానికి ఇప్పుడప్పుడే సిద్ధంగా లేను.

పెళ్లి బంధం బీటలు వారండంతో డిప్రెషన్‌లోకి..
నా మొదటి పెళ్లితో ఎన్ని తంటాలు వచ్చాయో, ఎన్ని కష్టాలు పడ్డానో మీ అందరికీ తెలుసు. అందుకే పెళ్లంటేనే భయమేస్తోంది. ఆ డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకే దుబాయ్‌ వెళ్లి వచ్చాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. జీవితంలో మనల్ని బాధపెట్టేవాళ్లు ఉంటారు. పుండు మీద కారం చల్లేవాళ్లు కూడా ఉంటారు. కానీ ఆ గాయాలకు ఆయింట్‌మెంట్‌ రాసేవారు కొందరే ఉంటారు. వారిని వదిలిపెట్టకుండా మనతోనే ఉంచేసుకుంటే మనకే మంచిది' అని చెప్పుకొచ్చింది రాఖీ సావంత్‌.

తనకంటే చిన్నవాడితో ప్రేమ.. వివాహం.. విడాకులు!
కాగా రాఖీ సావంత్‌ గతంలో రితేశ్‌ సింగ్‌ను పెళ్లాడింది. అయితే అతడు తనకు ఇదివరకే వివాహమైన విషయాన్ని దాచిపెట్టాడు. పైగా మొదటి భార్యకు విడాకులు కూడా ఇవ్వలేదు. రితేశ్‌కు భార్యాపిల్లలు ఉన్నారని, అతడితో తన పెళ్లి చెల్లదంటూ తెగదెంపులు చేసుకుంది నటి. గతేడాది ప్రేమికుల రోజున భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్‌ దురానీతో ప్రేమలో పడింది. అతడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఆ విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టింది. కానీ కొంతకాలానికే వీరి మధ్య గొడవలు ‍తలెత్తడంతో చివరకు భర్తను జైల్లో పెట్టించింది రాఖీ సావంత్‌. అతడితో విడిపోయినప్పటికీ విడాకులు మంజూరవడం కోసం ఎదురు చూస్తోంది.

చదవండి: షారుక్‌ ఖాన్‌కు చేదు అనుభవం

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)