Breaking News

‘రాకాస’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Published on Fri, 04/03/2026 - 14:02

‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత మెగా డాటర్‌ నిహారిక నిర్మించిన రెండో చిత్రం రాకస. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్స్‌..మరే చిత్రానికి చేయలేదు. మెగా హీరోలు కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. ఇక ట్రైలర్‌, టీజర్లు కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇలా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? నిర్మాతగా నిహారిక ఖాతాలో రెండో విజయం పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్‌ వీరు(సంగీత్‌ శోభన్‌).. తన ప్రియురాలు సుకన్యను పెళ్లి చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో సుకన్య పెళ్లికి రెడీ అవుతుంది. బ్రేకప్‌ బాధలో ఉన్న సమయంలోనే సోము(వెన్నెల కిశోర్‌) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని పాస్‌పోర్ట్‌ని పోలీసులు తీసుకెళ్తారు. సోము జాడని కనిపెడితే తన పాస్‌పోర్టు తిరిగి వస్తుందని.. స్నేహితుడు బాలు(గెటప్‌ శ్రీను)తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. 

అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా తిష్టవేసుకొని ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరంతా కలిసి ఓ ముసలాడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. చివరి క్షణంలో అతను చనిపోతాడు. అతనికి బదులుగా బాలు పోవాల్సి ఉండగా.. వీరూ అడ్డుపడతాడు. దీంతో బాలుకి బదులుగా వీరూ ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కోట ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఏంటి? నిజంగానే ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడా? సుబ్బులక్ష్మి(నయన్‌ సారిక) ఎవరు? ఆమె ఎందుకు కోటలోకి వెళ్లింది? సోము సంగతి ఏంటి? నిజంగా చనిపోయాడా? లేదా బతికే ఉన్నాడా? బలి కోసం కోటలోకి వెళ్లిన తర్వాత వీరూకి ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి ప్రాణాలలో బయటకు వచ్చాడా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
హారర్‌ కామెడీ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నటీనటులు, కథను పట్టించుకోరు. భయపెడుతూ నవ్విస్తే చాలు.. ఆ సినిమాను ఆదరిస్తారు. రాకస టీమ్‌ కూడా అదే పని చేసింది. చిన్నప్పుడు చదువుకున్న బకాసురుడి కథను స్ఫూర్తిగా తీసుకొని దర్శకురాలు మానస శర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే హారర్‌ కంటే ఎక్కువగా కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టారు. అది బాగానే వర్కౌట్‌ అయింది కూడా. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్‌ చేసే సన్నివేశాలతో ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాను తీర్చిదిద్దారు.

పాడుబడ్డ కోట..ఆ కోటకు వెయ్యేళ్ల చరిత్ర.. బ్రహ్మరాక్షసుడి కండీషన్‌..ఇలా సినిమా ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. ఎప్పుడైతే హీరో ఎంట్రీ ఇస్తాడో కథనం కామెడీ వైపు టర్న్‌ తీసుకుంటుంది. ప్రియురాలి కోసం అమెరికా నుంచి రావడం..అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం.. ఊరి పెద్దల తీర్పుతో పాస్‌పోర్టు కోల్పోవడం..ఇందంతా కామెడీగా సాగిపోతాయి. అయితే ఈ తరహా పంచ్‌లు, కామెడీ సీన్లు చాలా సినిమాల్లో చూడడంతో ఫస్టాఫ్‌ అంతగా ఆకట్టుకోదు. అసలు కథను ప్రారంభించడానికి ఇదంతా సాగదీశారనే ఫీలింగ్‌ కలుగుతుంది. 

ఇంటర్వెల్‌ సీన్‌తో కథపై ఆసక్తి పెరుగుతుంది. హీరో ఎప్పుడైతే కోటలోకి ప్రవేశిస్తాడో.. అప్పటి నుంచి కథనం పరుగులు పెడుతూ.. నవ్వులు పూయిస్తుంది. బ్రహ్మరాక్షసుడి సీన్‌ భయపడితే..దెయ్యాల సీన్‌ నవ్వులు పూయిస్తుంది. ఇక గెటప్‌ శ్రీను, వెన్నెల కిశోర్‌, నయన్‌ సారిక కూడా కోటలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నవ్వులు డబుల్‌ అవుతాయి.  అదే సమయంలో బ్రహ్మరాక్షసుడి నుంచి ఈ గ్యాంగ్‌ ఎలా తప్పించుకుంటుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది.  క్లైమాక్స్‌ కాస్త ఎమోషనల్‌గా అనిపిస్తుంది. అయితే సినిమా ప్రారంభం నుంచి ఎండ్‌ వరకు చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. ఈ రోజుల్లు దెయ్యాలు, రాక్షసులు ఉంటాయా? అని లాజిక్కులు వెతక్కుండా  సినిమా చూస్తే ఎంజాయ్‌ చేస్తారు. 

ఎవరెలా చేశారంటే.. 
సంగీత్‌ శోభన్‌ మంచి నటుడు. ఏ పాత్రలోనైనా ఇట్టే లీనమైపోతాడు. వీరూ పాత్రలో కూడా ఒదిగిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్‌, సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నయన్‌ సారిక తెరపై అందంగా కనిపించింది. వీరిద్దరి లవ్‌ట్రాక్‌ అంతగా పండలేదు కానీ.. బోర్‌ మాత్రం కొట్టించదు.  గెటప్‌ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ కూడా ఈ సినిమాకు ప్లస్‌ అయింది. కోటలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. తనికెళ్ల భరణి, ఆశిష్‌ విద్యార్థి, బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.  ఇలాంటి సినిమాకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. కొన్ని చోట్ల బీజీఎంతోనే భయపెట్టాలి.  ఈ విషయంలో సంగీత దర్శకుడు అనుదీప్‌ దేవ్‌ సక్సెస్‌ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్‌ఎక్స్‌  విజువల్స్‌  బాగుతున్నాయి.  ఎడిటింగ్‌ ఓకే. నిహారిక ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. గ్రాండ్ లెవల్ లో సినిమాను నిర్మించారు.

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)