Breaking News

అబ్రాడ్‌కు వెళ్లిపోయిన రజనీకాంత్‌

Published on Fri, 05/17/2024 - 07:11

కోలీవుడ్‌ స్టార్‌ రజనీకాంత్‌కు తాను నటించిన చిత్రం పూర్తి కాగానే విశ్రాంతి కోసం ఆధ్యాత్మికత  పర్యటనలకు వెళ్లడం పరిపాటి. అలా హిమాలయాలు, హరిద్వార్, ద్వారకేష్‌ వంటి ప్రదేశాలకు వెళ్లి ఒకటి రెండు వారాలు ధ్యానం, యోగా వంటి మానసికంగా నూతనోత్సాహాన్ని పొంది వస్తుంటారు. 

ప్రస్తుతం ఈయన కథానాయకుడిగా నటిస్తున్న వేట్టైయాన్‌ చిత్రాన్ని జై భీమ్‌ చిత్రం ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శతక్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నటుడు అమితాబ్‌ కీలక పాత్రను పోషించిన ఇందులో నటి దుషారా విజయన్, రిత్వికాసింగ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా రజనీకాంత్‌  ఈ చిత్రం షూటింగ్‌ను ఇటీవలే  పూర్తి చేశారు. తదిపరి లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కూలీ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. 

సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ నెలల్లో  ప్రారంభం కానుంది. దీనికి అనిరుధ్‌ సంగీతాన్ని, గిరీష్‌ గంగాధరన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌  ఫస్ట్‌ ఆఫ్‌ కథను సిద్ధం చేసి.. సెకండ్‌ ఆఫ్‌ పూర్తిచేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో రజనీకాంత్‌ రిలాక్స్‌ కోసం తాజాగా అబ్రాడ్‌కు వెళ్లారు. ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి అబుదాబి వెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా మరో కొన్ని వారాలు అక్కడ గడిపిన తరువాత రజనీకాంత్‌ చెన్నైకి తిరిగి వస్తారని సమాచారం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)